• రాసిన వారు Revathi
  • చివరిగా మార్పుచేసినది 29-08-2022

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రథమ సంవత్సరం పరీక్ష ప్రక్రియ 2023

img-icon

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు 11వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి పరీక్షలు. పరీక్ష ప్రక్రియలో ప్రతి సబ్జెక్టుకు సబ్జెక్ట్ పేరు, ఎగ్జామ్ (పరీక్ష) కోడ్ మరియు ఎగ్జామ్ (పరీక్ష) కాల వ్యవధి ఉంటాయి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ స్ట్రీమ్స్ కోసం AP బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో 11వ తరగతి సిలబస్, సబ్జెక్టుల వారీగా పరీక్షా ప్రక్రియను విడుదల చేస్తుంది. ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పాటర్న్ పేరుతో పొందుపరిచిన ఈ కథనం మీకు తెలియజేస్తుంది.

బీఐఈఏపీ ( BIEAP) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఏపీ ఇంటర్ పరీక్షల ప్రక్రియ గురించి బాగా అర్ధం చేసుకోవాలి, దాని ద్వారా అడిగే ప్రశ్నలు, మార్కింగ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఏపీ ఇంటర్ పరీక్షల సరళిని పరిశీలిస్తే, విద్యార్థులు పరీక్ష కోసం సిద్ధమవడానికి తమ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పాటర్న్ నాలుగు వర్గాలుగా విభజించవచ్చు:

1. గరిష్ట 100 మార్కులతో సబ్జెక్టులు: వీటిలో ఇంగ్లీషు, ఐచ్ఛిక భాషలు (తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, ఉర్దూ, అరబిక్, తమిళం, కన్నడ, ఒరియా, మరాఠీ), వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, పౌరశాస్త్రం, చరిత్ర, భూగర్భ శాస్త్రం, హోమ్ సైన్స్, సోషియాలజీ, లాజిక్ , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు సైకాలజీ ఉన్నాయి.

2. గరిష్ట 75 మార్కులు ఉన్న సబ్జెక్టులు: వీటిలో మ్యాథ్స్ మరియు జియోగ్రఫీ ఉన్నాయి.

3. గరిష్ట 60 మార్కులు ఉన్న సబ్జెక్టులు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ మరియు బోటనీ వంటి సబ్జెక్టులు ఈ కేటగిరీ కిందకు వస్తాయి.

4. గరిష్ట 50 మార్కులు ఉన్న సబ్జెక్టులు: సంగీతం ఈ వర్గానికి సంబంధించిన సబ్జెక్టులలో ఒకటి

ప్రతి స్ట్రీమ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లు, అలాగే భాష మరియు ఐచ్ఛిక పేపర్‌ని తెలుసుకోవడానికి దిగువ పట్టికను చూడండి:

సైన్స్ స్ట్రీమ్కామర్స్ స్ట్రీమ్ఆర్ట్స్ స్ట్రీమ్ఐచ్ఛికం/ భాష విషయం
వృక్ష శాస్త్రంఅకౌంటెన్సీచరిత్రఇంగ్లీష్ (మొదటి భాష)
జంతు శాస్త్రంబిజినెస్ స్టడీస్/కామర్స్భూగోళ శాస్త్రం మరియు భూగర్భ శాస్త్రంతెలుగు (రెండవ భాష)
భౌతిక శాస్త్రంఆర్థిక శాస్త్రంపౌర శాస్త్రం/రాజకీయ శాస్త్రంహిందీ
రసాయన శాస్త్రంఆంగ్లంమనోవిజ్ఞాన శాస్త్రంగణితం
గణితం (A) ఆర్థిక శాస్త్రం ఆనర్స్సామాజిక శాస్త్రంఆర్థికశాస్త్రం
గణితం (B)కంపూటర్స్ఆర్థిక శాస్త్రంసంస్కృతం

AP బోర్డు ఇంటర్ తరగతి 11 యొక్క పరీక్ష ప్రక్రియ వివరాలు

ప్రతి సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులు ఉంటుంది. ఉత్తీర్ణతకు ప్రతి సబ్జెక్టులో విద్యార్థి కనీసం 35% పొందాలి. అదనంగా, పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మొత్తం 35% స్కోర్ అవసరం. పరీక్ష మొత్తం వ్యవధి మూడు గంటలు. పరీక్షా విధానం మరియు మార్కింగ్ స్కీమ్ గురించి ముఖ్యాంశాలను తెలుసుకోవడానికి దిగువ పట్టికను చూడండి:

పారామితులువివరాలు
ప్రతి పేపర్‌కు గరిష్ట మార్కులు100 మార్కులు
మొత్తం సమయ వ్యవధి3 గంటలు
అర్హత మార్కులుప్రతి సబ్జెక్టులో 35 మార్కులు మరియు మొత్తం 35%
నెగెటివ్ మార్కింగ్లేదు

ఏపీ (AP) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్కింగ్ స్కీం 2023 – వివరాలు

బోర్డు పేరుబోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తరగతిఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం
పరీక్ష పేరుపబ్లిక్ ఎగ్జామ్స్
విభాగంపరీక్ష ప్రక్రియ
ప్రదేశంఆంధ్ర ప్రదేశ్ 
అధికారిక వెబ్‌సైట్http://bieap.gov.in/

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పాటర్న్ గురించి విద్యార్థులు ఆలోచించడానికి ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్ ప్యాట్రన్ సహాయపడుతుంది. ఏపీ బోర్డు మార్కింగ్ స్కీమ్ ద్ద్వారా, విద్యార్థులు 2023 లో వారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలలో ఉత్తమమైన మార్కులను పొందడం కోసం తమను తాము సిద్ధం చేసుకోవచ్చు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ AP బోర్డు ప్రిపరేషన్ వ్యూహం

విద్యార్ధి భవిష్యత్ జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు రావడానికి ఎలా చదవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇలాంటి ప్రశ్నలకు EMBIBE ద్వారా మీకు సమాధానాలను ఇవ్వబోతున్నాను. వీటిని జాగ్రత్తగా పాటిస్తే పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 

భౌతిక శాస్త్రం

విద్యార్థులు భౌతిక శాస్త్రాన్ని చదివిన తర్వాత దాన్ని పునశ్చరణ చేసుకోడానికి కూడా సమయాన్ని కేటాయించాలి. మునుపటి సంవత్సరం క్వశ్చన్ పేపర్ లను చదవడం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకొనే అవకాశం ఉంటుంది. 

పని శక్తి సామర్థ్యం డోలనాలు ఉష్ణగతిక శాస్త్రాలను బాగా చదవాలి ఎందుకంటే వాటి నుండి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. సమతలంలో చలనం, గమన నియమాలు, భ్రమణ గమనం, గురుత్వాకర్షణ, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, పదార్థాల ఉష్ణ ధర్మాలు వంటి అధ్యాయాలను చదవడం వల్ల వాటి నుండి వచ్చే స్వల్ప సమాధాన ప్రశ్నలను సులభంగా రాయవచ్చు. పాఠ్యాంశం వెనక ఉన్న అన్ని అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను చదవడం వల్ల మీరు పరీక్షలో మీ స్కోరును అభివృద్ధి చేసుకోవచ్చు..

రసాయన శాస్త్రం

ఒక పాఠాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్న రసాయన సమీకరణాలు, సూత్రాలను అలాగే పటాలను ఒక కాగితంపై రాసుకోవాలి. కొన్నిసార్లు రెండు రెండు మార్కుల ప్రశ్నలను జతచేసి నాలుగు మార్కుల ప్రశ్న అడుగుతారు. అలాంటప్పుడు వాటికి సంబంధించిన సమీకరణాలు, పటాలు, ఉదాహరణలను రాయాలి..

సంకరీకరణాన్ని చదువుతున్న సమయంలో ఎలక్ట్రాన్ విన్యాసం, అణువుల నిర్మాణాలను చదువుతున్నప్పుడు పట్టాలు, అణువుల పటాల్లో బంధకోణం, బంధ పొడవు, అణువు ఆకృతి వంటివి బాగా చదవాలి. ఎనిమిది మార్కుల ప్రశ్నల కోసం పరమాణు నిర్మాణం (అటామిక్ స్ట్రక్చర్), మూలకాల వర్గీకరణ ఆవర్తన ధర్మాలు (క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్  పిరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్) వంటివి బాగా చదవాలి. పదార్థ స్థితులు (స్టేట్స్ అఫ్ మాటర్) స్టాయికియోమెట్రీ, ఉష్ణగతిక శాస్త్రం, రసాయన సమతాస్థితి (కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియమ్) p- బ్లాక్ మూలకాలు వంటి వాటి నుండి నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయి. రసాయన బంధం (కెమికల్ బాండింగ్) అనేది ఎంతో ప్రాముఖ్యమైనది దీనినుండి ఎనిమిది మరియు నాలుగు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

వృక్ష శాస్త్రం

బోటనీలో బొమ్మలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వృక్ష శాస్త్రంలోని చాప్టర్ లను వెయిటేజీ అనుగుణంగా చదవాలి. వాటిలో మీకు డయాగ్రమ్స్ వేయడం వస్తే అన్ని వచ్చినట్టే. అందుకే వాటిని తరచూ ప్రాక్టీస్ చేస్తూ వాటికి లేబులింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు పరీక్షలలో మర్చిపోయే అవకాశం ఉండదు. 

మార్ఫాలజీ, అనాటమీ, రిప్రొడక్షన్ వంటి వాటి నుండి ఒక దీర్ఘ సమాధాన ప్రశ్న చొప్పున వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రశ్ననూ వదలకూడదు. ఈ చాప్టర్లలో అన్ని ప్రశ్నలను బాగా చదవాలి. చిన్న చాప్టరైన ఏకాలజీ లో ప్రశ్నలు చాలా తేలిగ్గా ఉంటాయి. దీనిలో నుండి ఆరు మార్కులు అలాగే సెల్ బయాలజీ బయోమాలిక్యూల్స్ నుండి 12 మార్కులు సులువుగా తెచ్చుకోవచ్చు. 

జంతు శాస్త్రం

దీనిలో ముఖ్యంగా దీర్ఘ సమాదాన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్ నుంచి సిమెట్రీ, సీలోమ్, ఎపిథీలియం, కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ మొదలైన వాటిని బాగా చదువుకోవాలి. 

పెరిప్లానెట్ అమెరికానా ఛాప్టర్ నుంచి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, మెయిన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వంటి వాటిని బాగా అధ్యయనం చేయడం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు. 

హ్యూమన్ హెల్త్ అండ్ డిసీస్ చాప్టర్ నుంచి ప్లాస్మోడియం ఇన్ మ్యాన్ అండ్ మస్కిటో, ఎంటమిబా, ఆస్కారిస్, ఉకరెరియా లైఫ్ సైకిల్ మంచి స్కోర్ తెచ్చే అంశాలు. 

ఇకాలజీ చాప్టర్ నుంచి ఫ్లో ఆఫ్ ఎనర్జీ, టెంపరేచర్ యాస్ ఏ ఫాక్టర్, లైట్ యాస్ ఏ ఫాక్టర్, టైప్స్ అఫ్ ఎకోసిస్టమ్ వంటి అంశాలు ప్రముఖ్యమైనవి.

ఇంగ్లీష్ 

తెలుగు మీడియం విద్యార్థులకు ఆంగ్లం అంటే భయం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లిష్ మీద పట్టు ఉన్నట్టుగా అనుకుంటారు. అయితే రెండూ సరైనవి కాదు. పట్టుదల కలిగి ఏకాగ్రతతో చదివితే ఎక్కువ మార్పులను సొంతం చేసుకోవడం చాలా సులభం. అయితే దానికి ముందుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. 

మొదటి సంవత్సరం విద్యార్థులు సెక్షన్ Aలో రాసేటప్పుడు అవసరమైన సైడ్ హెడ్డింగ్ తో పాఠం, పద్యం రచయిత పేరు రాయాలి. సమాధానాలు సూటిగా మరియు స్పష్టంగా ఉండాలి. సాధారణంగా పాఠంలోని విషయం మొత్తాన్ని రాస్తూ ఉంటారు. అది చాలా విసుగు తెప్పిస్తుంది. దీని వల్ల మార్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు పేపర్ లో కొట్టివేతలు మరియు స్పెల్లింగ్ మిస్టెక్‌లు ఉండకుండా చూసుకోవాలి. 

సెక్షన్ Bలో రెండు పాసేజ్లో ఒకదానికి ఆరు ప్రశ్నలు ఇచ్చి నాలుగు సమాధానాలు రాయమనీ అడుగుతారు. మీకు వస్తే ఆఋ సమాధానాలు రాయడం మంచిది. పాఠ్యపుస్తకంలో రీడింగ్ కాంప్రహెన్షన్ పాసేజ్లను తప్పకుండా చూసుకోవడం మంచిది. సమాధానాలు ప్రశ్నకు తగ్గట్టుగా సూటిగా మరియు సరళంగా ఉండేలా చూసుకోండి. 

సెక్షన్ C రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన ప్రశ్నలను అదే క్రమంలో రాసే విధంగా చూసుకోండి. బిట్స్ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాస్తే మంచిది. ఇలా పరీక్ష రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

సంస్కృతం

సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకున్నా ప్రథమ సంవత్సరం విద్యార్థులు పద్యాలు, వ్యాసరూప ప్రశ్నలు, వ్యాకరణం వంటివాటికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో వ్యాసరూప ప్రశ్నలు మాతృ భాష లేదా ఆంగ్లంలో కూడా రాయవచ్చు. వ్యాకరణం విషయంలో సంధులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వీటిని సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులు వారి పాఠశాలలో ఏదో ఒక భాషలో చదివే ఉంటారు. వాటిని ప్రతిరోజు రాతపూర్వక అభ్యాసం ద్వారా నేర్చుకోవచ్చు. వ్యాకరణాంశాలు అన్నింటికి రాతపూర్వక అభ్యాసం చాలా అవసరమని గమనించండి. 

సగటు ఉత్తీర్ణత కోరే విద్యార్థులు అంశాలను దృష్టిలో ఉంచుకొని చదవాలి. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకునే విద్యార్థులు అన్ని పాఠాల వ్యాసరూప ప్రశ్నలను చదివితే సందర్భాలు, స్వల్ప, అతి స్వల్ప ప్రశ్నలకు జవాబులు రాయడం చాలా తేలిక అవుతుంది. మీ ఉపాధ్యాయులు చెపే విషయాలను కూడా పరిగాణలోనికి తీసుకోండి..

AP ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్

ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ప్రకటించడానికి బిఐఈఎపి గ్రేడింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. దీనిలో A1 నుంచి D1 వరకు 7 విభిన్న గ్రేడ్ ఉంటాయి అలాగే విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా అవి కేటాయించబడతాయి. గ్రేడింగ్ సిస్టమ్ మరియు విభిన్న మార్కులకు ఇవ్వబడే గ్రేడ్ గురించి తెలుసుకోవడం కోసం దిగువ పట్టికను చూడండి.

మొత్తం మార్కులుగ్రేడ్
91-100A1
81-90A2
71-80B1
61-70B2
51-60C1
41-50C2
35-40D1

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పాటర్న్ పై తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు):

ప్రశ్న 1: AP ఇంటర్ 11వ తరగతి పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి?

జ: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలలో ఉత్తీర్ణత కోసం ప్రతి సబ్జెక్టులో విద్యార్థి కనీసం 35% పొందాలి. 

ప్రశ్న 2: పరీక్షలు జరిగే విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా?

జ. ప్రస్తుతం ఎలాంటి మార్పులను ఆంధ్ర ప్రదేశ్ బోర్డు తమ అధికారిక వెబ్సైటులో పేర్కొనలేదు. కాబట్టి పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు ఉండదు, ఎప్పటిలాగానే జరుగుతాయి. ఏమైన మార్పులు జరిగితే మేము మా వెబ్సైటులో పేర్కొంటాము. తరచూ సందర్శించండి.

ప్రశ్న 3: పరీక్షలలో గ్రేస్ మార్కులు ఎన్ని ఇస్తారు?

జ: సిలబస్‌లో లేని ప్రశ్నలు ఒకవేళ పరీక్షలో వస్తే గ్రేస్ మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ప్రశ్న 4: ఇంటర్ మొదటి సంవత్సరం AP బోర్డు పరీక్షా సమయం ఎంత? ఏమైనా గ్రేస్ టైమ్ ఉంటుందా?

జ: పరీక్ష మొత్తం సమయం 3 గంటలు. ఆ సమయంలోనే విద్యార్ధులు అన్నీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గ్రేస్ టైమ్ ఏమి ఉండదు.

ప్రశ్న 5: ఆంధ్ర బోర్డు ఇంటర్ తరగతి 11 సప్లిమెంటరీ పరీక్షల గురించి వివరాలు చెప్పగలరా?

జ: సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3, 2022 నుండి ప్రారంభమవుతాయి. వాటి గురించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైటులో ఇవ్వబడ్డాయి. 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పాటర్న్ ఈ వివరణాత్మక కథనం మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ప్రశ్నలను దిగువన రాయండి మరియు మేము వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తాము.

AP 11వ తరగతి 2023పైన అవసరమైన చిట్కాలు మరియు అప్‌డేట్‌ల కోసం Embibeను చూస్తూ ఉండండి.

Embibeలో 3D లెర్నింగ్, బుక్ ప్రాక్టీస్, టెస్టులు మరియు సందేహ నివృత్తి ద్వారా మీ ఉత్తమ పనితీరు కనబరచండి