• రాసిన వారు Vishnuvardan Thimmapuram
  • చివరిగా మార్పుచేసినది 26-08-2022

ఆంధ్ర ప్రదేశ్ బోర్డు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 2023 ఫలితాలు:

img-icon

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) తన అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తుంది. 2023 జూన్ 22న ఆంధ్ర ప్రదేశ్ బోర్డు ఇంటర్ ప్రథమ మరియు AP ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు బీఐఈఏపీ (BIEAP) విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా AP 2023 ఇంటర్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

ఆంధ్రా బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు AP ఇంటర్ ఫలితాల తేదీ, కటాఫ్, పరీక్షకు సంబంధించిన ఇతర కీలక సమాచారాన్ని ముందుగా తెలుసుకోవాలి. 2023 ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల గురించి మరిన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకోవడానికి దీనిని చదవండి.

ఇంటర్ సెకండ్ ఇయర్ ఆంధ్ర బోర్డు ఫలితాలు 2023 :

ఏపీ బోర్డు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ విధానంలో విడుదల చేయబడతాయి bie.ap.gov.in

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
నిర్వహణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (APBIE లేదా BIEAP)
పరీక్ష రకం పబ్లిక్ ఎగ్జామ్
తరగతి సీనియర్ ఇంటర్మీడియట్ లేదా ఇంటర్ ద్వితీయ సంవత్సరం
AP ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల విడుదల జూన్ 22, 2023

ఏపీ ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాల తేదీ 2023

ఏపీ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను 2023 \ న ప్రకటించారు. ఇంటర్ 2023  AP బోర్డు పరీక్ష కోసం పరీక్ష క్యాలెండర్ను మీరు ఇక్కడ తనిఖీ చేయవచ్చు:

వివరాలు అంచనా తేదీలు
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ పరీక్ష తేదీ మే 6, 2023 నుంచి మే 25, 2023 వరకు
AP ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు 2023 జూన్ 22, 2023
AP ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు 2023 జూన్ 22, 2023
ప్లస్ టూ (ఇంటర్ సెకండ్ ఇయర్) సప్లిమెంటరీ ఎగ్జామ్ 3 ఆగస్టు 2023 నుండి 12 ఆగస్టు 2023 వరకు
ఇంటర్ రెండవ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల తేదీ సెప్టెంబర్ (అంచనా)

AP ఇంటర్ బోర్డు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

అధికారిక వెబ్ సైట్ నుండి మీ ఆంధ్రా బోర్డు ద్వితీయ సంవత్సరం ఫలితాలు / ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి:

మొదటి దశ: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక వెబ్ సైట్ లో, అంటే bie.ap.gov. కి వెళ్లండి.

రెండవ దశ: ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీ ఐపీఈ (IPE) 2023 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

మూడవ దశ: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

నాల్గవ దశ: మీ పేరు లేదా హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.

ఐదవ దశ: AP ఇంటర్ స్కోర్ కార్డ్ PDFను డౌన్ లోడ్ చేసుకొని భవిష్యత్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి.

ఎస్ఎంఎస్ (SMS) ద్వారా ఏపీ ఇంటర్ తరగతి 12 ఫలితాలను చెక్ చేయడం ఎలా?

మీ నెంబరుకు దిగువ ఇవ్వబడిన వాటిని పంపింస్తే ఎస్ఎమ్ఎస్ (SMS) ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మీరు చెక్ చేయవచ్చు:

జనరల్ SMS – APGEN2REGISTRATION NO మరియు 56263 కు పంపండి
ఒకేషనల్ SMS – APVOC2REGISTRATION NOమరియు 56263 కు పంపండి

ఏపీ ఇంటర్ బోర్డు రెండవ సంవత్సరం మార్కుల షీటులో పేర్కొన్న వివరాలు

ఇంటర్ సెకండ్ ఇయర్ ఆంధ్రా బోర్డు 2023 ఫలితాలలో పేర్కొన్న వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

  • పరీక్ష పేరు
  • నిర్వహణ సంస్థ
  • రోల్ నెంబరు
  • విద్యార్థి పేరు
  • సబ్జెక్టు
  • వచ్చిన మార్కులు
  • సబ్జెక్టుల వారీగా ఫలితాలు
  • మొత్తం మార్కులు
  • తుది ఫలితం

ఇంటర్మీడియట్ తరగతి 12 ఆంధ్ర ప్రదేశ్ బోర్డు 2023 ఫలితాలు గ్రేడింగ్ సిస్టమ్

AP బోర్డు  ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల గ్రేడింగ్ సిస్టమ్ 

కింది పట్టికలో పేర్కొనబడ్డినది.

మార్కులు గ్రేడ్
91-100 A1
81-90 A2
71-80 B1
61-70 B2
51-60 C1
41-50 C2
35-40 D
35 మార్కుల కంటే తక్కువ ఫెయిల్

గత ఏడాది ఇంటర్ ఏపీ బోర్డు 12వ తరగతి ఉత్తీర్ణత శాతం

ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులు రెండింటికీ గత సంవత్సరాల ఉత్తీర్ణత శాతం ఈ క్రింది విధంగా ఉంది:

ఇయర్ (సంవత్సరం) జనరల్ ఒకేషనల్
2019 72% 69%
2018 73.33% 67%
2017 72.71% 67.55%
2016 69.30% 67.32%
2015 66.61% 60.05%
2014 55.84% 42.80%

ఏపీ ఇంటర్ రెండవ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ (పరీక్షలు)

అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి, అదనంగా ఏ సబ్జెక్టులోనైనా తమ స్కోరును మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులు AP బోర్డు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలో విద్యార్థి సాధించిన మార్కులు మొదటి వ్రాసిన పరీక్షలో సాధించిన మార్కుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అప్పుడు కొత్తగా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలో మార్కులు తక్కువగా ఉంటే మొదటి ప్రయత్నంలోని మార్కులనే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఒకవేళ మీరు ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ పరీక్షలో ఫెయిల్ అయితే?

బాధపడకండి . ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే.

ఏపీ ఇంటర్ 12వ తరగతిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆ సబ్జెక్టులకు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు, వారు ఉత్తీర్ణులైన సబ్జెక్టుల కోసం సప్లిమెంటరీ పరీక్షకు కూడా హాజరు కావచ్చు, కాకపోతే స్కోరును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ సబ్జెక్టులకు, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలా కాకుండా, వారు తమ మొదటి ప్రయత్నంలో అధిక స్కోరును సాధించారా లేదా అనే దానితో సంబంధం లేకుండా కొత్త మార్కులు పరిగణనలోకి తీసుకోబడతాయి.

ఒక విద్యార్థి ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం)లో ఫెయిల్ అయ్యి, మ్యాథ్స్ (గణితం) లో తక్కువ మార్కులు సాధించాడని అనుకుందాం. అతను రెండు సబ్జెక్టులకు సప్లిమెంటరీ పరీక్ష రాయవచ్చు. అతను ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) కొరకు సప్లిమెంటరీ ఎగ్జామ్ మరియు మ్యాథ్స్ (గణితం) కొరకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షని రాయలేడు. ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్ అనేది అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే.

ఇప్పుడు, అతను సప్లిమెంటరీ పరీక్షలో ఫిజిక్స్‌లో ఉత్తీర్ణుడైతే, గణితంలో అతని మొదటి ప్రయత్నం కంటే తక్కువ స్కోర్లు సాధిస్తే, అప్పుడు రెండు సబ్జెక్టులకు, సప్లిమెంటరీ పరీక్షలో అతని మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

కాబట్టి, ఇప్పుడు AP ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు 2023 గురించి ప్రతి విషయం మీకు  తెలుసు. ఆత్మ విశ్వాసంతో మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారని మేము ఆశిస్తున్నాము.

AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2023 – పరీక్షకు సూచనలు

ఆంధ్రా బోర్డు ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2023 తో పాటు కొన్ని ముఖ్యమైన పరీక్షా సూచనలను బోర్డు అందిస్తుంది. ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ 2023 ఫలితాలలో మంచి స్కోర్ సాధించడానికి విద్యార్థులు అన్ని సూచనలను జాగ్రత్తగా చదవాలి అలాగే పరీక్ష సమయంలో వాటిని పాటించాలి.

పరీక్ష ప్రారంభం కావడానికి ముందు ప్రతి విద్యార్థికి అదనంగా 15 నిమిషాలు ఇవ్వబడుతుంది. ప్రశ్నాపత్రాన్ని చదివి అర్ధం చేసుకోవడానికి విద్యార్ధులకు ఈ సమయం ఇవ్వబడుతుంది, దాని వల్ల విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని చదవవచ్చు మరియు ఒక వ్యూహాన్ని తయారు చేసుకోవచ్చు. 

ప్రత్యేకమైన పిల్లలకు పరీక్షను పూర్తి చేయడానికి అదనంగా అరగంట సమయం ఇవ్వబడుతుంది.

పరీక్ష హాలుకు వచ్చే ముందు విద్యార్థులు 2023 ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్లను జాగ్రత్తగా తీసుకెళ్లాలి. 

పరీక్ష నియమ నిబంధనలను ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంగించకూడదు. 

మొబైల్ ఫోన్ లేదా కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లకూడదు. 

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆంధ్ర ప్రదేశ్ బోర్డు 2023  సప్లిమెంటరీ  పరీక్ష తేదీలు

ఇంటర్ సెకండ్ ఇయర్ AP టైమ్ టేబల్ కింద పట్టికలో ఇవ్వబడింది:

తేదీ పరీక్ష పేపర్
2023 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
2023 ఇంగ్లీష్ పేపర్-2
2023 మాథమాటిక్స్ పేపర్-2A
బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2
2023 మాథమాటిక్స్ పేపర్-2B,
జూవాలాజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
2023 ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
2023 కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
సోషియాలాజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, ,మ్యూజిక్ పేపర్-2
2023 జియోలాజీ పేపర్-2, హోం సైన్స్ పేపర్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్-2, ,లాజిక్ పేపర్-2, బిడ్జ్స్ కోర్స్ పేపర్-2, మ్యాథ్స్ (Bi.P.C విద్యార్థులకు)
2023 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్- 2, జియోగ్రాఫి పేపర్ -2

ఏపీ ఇంటర్ బోర్డు ద్వితీయ సంవత్సరం ఫలితాల గురించి తరచూగా అడిగే ప్రశ్నలు (FAQలు) 

ప్రశ్న 1. AP ఇంటర్ సెకండ్ ఇయర్  2023 ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు?

జ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫలితాలను జూన్ 22, 2023 న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రకటిస్తారు.

ప్రశ్న 2. ఏపీ ఇంటర్ 2023  ద్వితీయ సంవత్సరం  పరీక్షలలో నేను ఎంత స్కోర్ చేయాలి?

జ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో అర్హత సాధించాలంటే విద్యార్థులు కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.

ప్రశ్న3.  2023 ఆంధ్ర ఇంటర్మీడియెట్ ఫలితాలను నేను ఎలా చెక్ చేయాలి?

జ: విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఎస్ఎంఎస్ (SMS) ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఫలితాలను ఆన్లైన్లో తనిఖీ చేయడానికి, విద్యార్థులు బీఐఈఏపీ (BIEAP) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి – bie.ap.gov.in 

ప్రశ్న 4. ఆంధ్రా  ఇంటర్మీడియట్ బోర్డు పేరును మీరు పేర్కొనగలరా?

జ: ఇంటర్మీడియట్ బోర్డు పేరు బీఐఈ (BIE).

ప్రశ్న 5. AP ఇంటర్మీడియట్‌లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి?

జ: ఆంధ్ర ఇంటర్ బోర్డులో ప్రధానంగా 6 గ్రూపులు ఉంటాయి:

  1. MEC (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్)
  2. CEC (సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్)
  3. HEC (హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్)
  4. MPC (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
  5. BIPC (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
  6. MPC మరియు BIPC యొక్క కాంబినేషన్, అంటే MBPC. ( మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)

AP ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు 2023పై ఈ వివరణాత్మక కథనం మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ప్రశ్నలను దిగువన రాయండి మరియు మేము వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తాము.

AP ఇంటర్ ద్వితీయ సంవత్సరం అర్హత 2023పైన అవసరమైన చిట్కాలు మరియు అప్‌డేట్‌ల కోసం Embibeను చూస్తూ ఉండండి.

Embibeలో 3D లెర్నింగ్, బుక్ ప్రాక్టీస్, టెస్టులు మరియు సందేహ నివృత్తి ద్వారా మీ ఉత్తమ పనితీరు కనబరచండి