• రాసిన వారు Vishnuvardan Thimmapuram
  • చివరిగా మార్పుచేసినది 25-08-2022

ఆంధ్రప్రదేశ్ బోర్డు పదవ తరగతి అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) – 2023

img-icon

10వ తరగతి అడ్మిట్ కార్డ్: ఆంధ్రప్రదేశ్లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) AP SSC 2023 హాల్ టికెట్ 2023 ఫిబ్రవరిలో విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 తరగతి 2023 అడ్మిట్ కార్డు ఆన్‌లైన్ అందుబాటులో ఉంటుంది.

10వ తరగతి హాల్ టికెట్ 2023ను ఆంధ్రప్రదేశ్ బోర్డు పరీక్షలకు 15 రోజుల ముందు విడుదల చేస్తుంది. AP బోర్డు 2023 పదో తరగతి అడ్మిట్ కార్డులో అభ్యర్థుల పేరు, రోల్ నంబర్, ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ షెడ్యూల్ వంటి వివరాలు పేర్కొనబడతాయి. పరీక్ష హాల్ టికెట్ లేకుండా విద్యార్ధులను పరీక్ష రాయడానికి అనుమతించరు. కాబట్టి విద్యార్ధులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డును తీసుకువెళ్లాలి. 

ఆంధ్రప్రదేశ్ బోర్డు తరగతి 10 హాల్ టికెట్లు 2023 రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్, ఓఎస్ఎస్సీ (OSSC) విద్యార్థులకు అదే రోజు విడుదల చేయనున్నారు. జిల్లా, పాఠశాల, పుట్టిన తేదీ, ఎన్టీఎస్ఈ (NAPE) ఆంధ్రప్రదేశ్ హాల్ టికెట్ 2023 వంటి అన్ని తప్పనిసరి వివరాలను నమోదు చేయడం ద్వారా విద్యార్థులు https://www.bse.ap.gov.in/ నుంచి 2023 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి హాల్ టికెట్ 2023లో పేర్కొనబడిన వివరాలను విద్యార్థులు ధృవీకరించుకోవాలి. వారు https://www.bse.ap.gov.in/ 2023 హాల్ టికెట్లను కనీసం రెండు ప్రింటవుట్లు తీసుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్ బోర్డు తరగతి 10 హాల్ టికెట్ రిలీజ్ డేట్ (విడుదల తేదీ), అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం, ఇలా మరిన్నింటిని తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

AP SSC హాల్ టికెట్ 2023 రిలీజ్ డేట్ (విడుదల తేదీ)

పదవ తరగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డు హాల్ టికెట్ 2023 విడుదల తేదీని విద్యార్థులు https://www.bse.ap.gov.in/  వెబ్‌సైట్‌‌ను సందర్శించి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

10వ తరగతి 2023 ఆంధ్రప్రదేశ్ బోర్డు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

విద్యార్థులు బిఎస్ఇ (BSE) ఆంధ్రప్రదేశ్ SSC 2023 హాల్ టికెట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు: https://www.bse.ap.gov.in/ AP SSC రెగ్యులర్ హాల్ టికెట్ 2023ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం దశలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌సి (SSC) బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను https://www.bse.ap.gov.in/  సందర్శించండి.
  • “ఎస్‌ఎస్‌సి (SSC) ఎగ్జామ్ 2023 హాల్ టికెట్స్ డౌన్లోడ్” అనే లింక్ పై క్లిక్ చేయండి. 
  • తరువాత, AP 10 వ తరగతి హాల్ టికెట్ 2023 లింక్ ను విద్యార్థి (రెగ్యులర్ / ప్రైవేట్ / ఓఎస్ఎస్‌సి / ఒకేషనల్) ప్రకారం ఓపెన్ చేయండి తరువాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • జాబితా నుంచి జిల్లా మరియు స్కూలును ఎంచుకోండి.
  • పేరు మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి. డౌన్‌లోడ్ హాల్‌టికెట్” ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు, విద్యార్థుల AP పదవ తరగతి హాల్ టికెట్ స్క్రీన్ పై చూపబడుతుంది.
  • ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి హాల్ టికెట్ 2023 ను డౌన్లోడ్ చేసి, భవిష్యత్తు ఉపయోగం కోసం సేవ్ చేయండి.
  • దానిని జాగ్రత్తగా ఉంచి పరీక్షా హాలుకు తప్పకుండా తీసుకెళ్లండి.

ఆన్లైన్ AP 10వ తరగతి హాల్ టికెట్లు 2023 డౌన్లోడ్ ఫైల్లో విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఫోటోగ్రాఫ్, ఎగ్జామ్ సెంటర్ వివరాలు, ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటాయి. 2023 హాల్ టికెట్లులో ఇవ్వబడ్డ అన్ని ప్రాథమిక వివరాలను జాగ్రత్తగా చూసుకోండి. బిఎస్ఇ (BSE) ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి హాల్ టికెట్లు 2023 డౌన్ లోడ్ చేసుకోవడం కోసం మేము డైరెక్ట్ లింక్ కూడా అందిస్తాము.

SSC ఆంధ్రప్రదేశ్ బోర్డు హాల్ టికెట్ 2023 – వివరాలు

ఆంధ్రప్రదేశ్ బోర్డు పదవ తరగతి హాల్ టికెట్ 2023 లో ఇచ్చిన వారి ప్రాథమిక మరియు పరీక్ష వివరాలను విద్యార్థులు నిర్ధారించుకోవాలి. ఈ వివరాలు AP SSC ఫలితాలు 2023 మరియు ఒరిజినల్ మార్కుల షీట్‌లో ఉన్న విధంగా ఇవ్వబడతాయి. కాబట్టి ఆన్లైన్ https://www.bse.ap.gov.in/హాల్ టికెట్‌లో ఏదైనా తేడా లేదా తప్పులు ఉంటే వారు సంబంధిత పాఠశాల అధికారులను సంప్రదించాలి. 

ఆంధ్రప్రదేశ్ టెన్త్ బోర్డు హాల్ టికెట్ 2023లో ఈ క్రింద ఇవ్వబడిన వివరాలు పేర్కొనబడ్డాయి.

తరగతి 10 ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు 2023 హాల్ టికెట్‌లో విద్యార్థులు ఈ కింది వివరాలను చెక్ చేసుకోవచ్చు.

  • విద్యార్థి పేరు
  • AP 10వ తరగతి హాల్ టికెట్ నెంబరు లేదా రోల్ నెంబరు
  • జిల్లా
  • తండ్రి పేరు
  • తల్లి పేరు
  • పాఠశాల పేరు
  • పరీక్షా కేంద్రం పేరు
  • పుట్టిన తేది
  • పరీక్షా మీడియం
  • లింగము
  • టైమ్ టేబల్
  • విద్యార్థి ఫోటోగ్రాఫ్
  • విద్యార్థి సంతకం
  • పరీక్ష తేదీ
  • పరీక్షా సమయం
  • పరీక్షా సూచనలు
  • పరీక్షా కేంద్రం చిరునామా

ఆంధ్రప్రదేశ్ SSC ఎగ్జామ్ హాల్ టికెట్ 2023 నమూనా చిత్రం

AP రాష్ట్ర బోర్డు పాఠశాల వారీగా పరీక్ష హాల్ టికెట్ 2023

ఒక పాఠశాల యొక్క సంబంధిత అథారిటీ వారి విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి  హాల్ టికెట్ 2023ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ నమోదు చేసి పాఠశాల BSE స్కూల్ పోర్టల్‌కు లాగిన్ కావాల్సి ఉంటుంది. డ్యాష్ బోర్డ్ మీద, వారు తమ పాఠశాలల ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితాను చూడవచ్చు. ఇప్పుడు వారు విద్యార్థి పేరు మీద క్లిక్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ  తరగతి హాల్ టికెట్ 2023 ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తరువాత వాటిని విద్యార్ధులకు అందిస్తారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డు SSC ఎగ్జామ్ 2023 ప్రిపరేషన్ చిట్కాలు 

విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ప్రిపరేషన్ చిట్కాలను కింద చూడవచ్చు. 

  • మీ AP SSC సిలబస్ 2023 ని మీరు నెమ్మదిగా అలాగే శ్రద్దగా చదవడానికి వీలుగా ఒక అధ్యయన ప్రణాళికను రూపొందించండి.
  • ఆంధ్రప్రదేశ్ 2023 సిలబస్ యొక్క ముఖ్యాంశాలను తక్కువ సమయంలో కవర్ చేయడానికి విద్యార్థులు నోట్స్ తయారు చేసుకోవాలి.
  • వారు వివిధ ప్రశ్నలతో ప్రాక్టీస్ చేయడానికి గత సంవత్సరం ప్రశ్నాపత్రాలను కూడా పరిష్కరించవచ్చు. ఇది 10వ తరగతి పరీక్షల కోసం మీ ఆలోచనా శక్తిని మరియు వ్యూహాన్నిపెంచుతుంది. 
  • మీ అధ్యయనాన్ని కొనసాగించిన తరువాత 5 నుంచి 10 నిమిషాల విరామం తీసుకోండి. 
  • ఆరోగ్యంగా తినండి మరియు క్రమం తప్పకుండా తగినంత నీరు త్రాగండి.
  • పరీక్షలకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి మీ పెద్దలు మరియు ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి.
  • అన్నీ ముఖ్యమైన ప్రశ్నలను చదవండి. పాఠ్య పుస్తకంలో ఉండే ప్రశ్నలు అన్నిటినీ జాగ్రతగా చదివి గుర్తుపెట్టుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్ బోర్డు టెన్త్  పరీక్షల కోసం ముఖ్యమైన సూచనలు:

విద్యార్ధులు పరీక్షా సమయంలో పాటించాల్సిన కొన్ని సూచనలు కింద పేర్కొనబడ్డాయి. 

  • పరీక్ష రోజున, వారు హాల్ టికెట్ పరీక్షా హాలుకు తీసుకెళ్లడం మర్చిపోకూడదు, లేకపోతే వారిని పరీక్ష రాయడానికి అనుమతించరు.
  • కాలిక్యులేటర్, మొబైల్ మొదలైన పరికరాలను పరీక్షా హాలులో అనుమతించబడదు.
  • మీ హాల్ టికెట్ మీద ఎలాంటి రాతలు ఉండకూడదు. 
  • ఎలాంటి కొట్టివేతలు లేకుండా సమాధానాలను చక్కగా రాయండి. అలాగే, అందంగా పటాలను గీయండి.
  • ఆంధ్రప్రదేశ్ హాల్ టికెట్ 2023 ను పరీక్ష హాల్ డెస్క్ మీద ఉంచండి, తద్వారా ఇన్విజిలేటర్ విద్యార్థికి ఇబ్బంది లేకుండా తనిఖీ చేయవచ్చు.
  • పెన్సిల్, స్కేలు, పెన్ మొదలైన పరీక్ష రాయడానికి కావాల్సిన పరికరాలను మీరే తీసుకువేలాలి. 
  • పరీక్ష ప్రారంభం కావడానికి ముందు ఇన్విజిలేటర్ మీకు చెప్పిన వాటిని తప్పకుండా పాటించాలి. 
  • పరీక్ష రాసే సమయంలో మీ తోటి విద్యార్ధులతో మాట్లాడకూడదు. 
  • ఇచ్చిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలను రాయడానికి ప్రయత్నించండి. 

10వ తరగతి ఆంధ్రప్రదేశ్ బోర్డు హాల్ టికెట్‌కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

ప్రశ్న 1: 2023 10వ తరగతి హాల్ టికెట్‌లో నా పేరు తప్పుగా ఉంటే నేను ఏమి చేయాలి?

జ. ఆంధ్రప్రదేశ్ బోర్డు 10వ బోర్డు 2023 హాల్ టికెట్‌లో రెక్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు సంబంధిత పాఠశాల అధికారులను సంప్రదించాలి.

ప్రశ్న 2: బిఎస్ఇ (BSE) ఆంధ్రప్రదేశ్ హాల్ టికెట్ 2023 యొక్క సాఫ్ట్ కాపీని నేను పరీక్ష హాలుకు తీసుకెళ్లవచ్చా?

జ. లేదు, విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ SSC బోర్డు హాల్ టికెట్ 2023 యొక్క హార్డ్ కాపీని మాత్రమే పరీక్ష హాలుకు తీసుకెళ్లాలి.

ప్రశ్న 3: AP SSC హాల్ టికెట్ 2023ను నేను ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

జ. ఆంధ్రప్రదేశ్ తరగతి పది ఫలితాలు 2023 ప్రకటించే వరకు విద్యార్థులు తమ 10వ తరగతి హాల్ టికెట్లను సురక్షితంగా ఉంచుకోవాలి.

ప్రశ్న 4: ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి హాల్ టికెట్ పాఠశాల నుంచి తీసుకునే అవకాశం ఉందా?

జ. అవును, మీరు 10వ తరగతి హాల్ టికెట్‌ను సొంతంగా అధికారిక వెబ్‌సైట్  నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా పాఠశాల నుంచి కూడా మీరు 10వ తరగతి హాల్ టికెట్ తీసుకోవచ్చు.

AP 10వ తరగతి అడ్మిట్ కార్డు 2023పై ఈ వివరణాత్మక కథనం మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ప్రశ్నలను దిగువన రాయండి మరియు మేము వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తాము.

AP పదవ తరగతి 2023పైన అవసరమైన చిట్కాలు మరియు అప్‌డేట్‌ల కోసం Embibeను చూస్తూ ఉండండి.

Embibeలో 3D లెర్నింగ్, బుక్ ప్రాక్టీస్, టెస్టులు మరియు సందేహ నివృత్తి ద్వారా మీ ఉత్తమ పనితీరు కనబరచండి