Saas ద్వారా AI అన్‌లాక్
స్వయం చాలితంగా టెస్ట్‌ను రూపొందించడం
ఆటోమేటెడ్ టెస్ట్ రూపొందించడం (ఆటోమేటెడ్ టెస్ట్ జనరేషన్) వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని ఆదా చేయడం మరియు వ్యక్తిగత పక్షపాతాన్నినివారించడం. అంతేకాకుండా అత్యంత నాణ్యమైన వ్యక్తీకరించిన టెస్ట్‌లను విద్యార్థుల, విద్యా సంస్థల ద్వారా ఆటోమెటిక్‌గా రూపొందించడం.
చాలా మంది విద్యార్థులకు మంచి ఉపాధ్యాయులు దొరక్కపోవడానికి ప్రధాన కారణం. సదరు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటం లేదా నాణ్యమైన విద్యకు అవసరమైన డబ్బును విద్యార్థులు చెల్లించలేకపోవడం. ఇక్కడ ఉపాధ్యాయుల సమయం కూడా కీలకమైనది. అందువల్లే ఆటో టెస్ట్ జనరేషన్ సహాయంతో ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలను రూపొందించడం కంటే బోధనకు ఎక్కువ సమయం కేటాయించడానికి మేము సహాయపడుతున్నాము. మనమే స్వయంగా మన చేతులతో అధిక నాణ్యత ఉన్నటువంటి టెస్ట్ ని అబివృద్ది చేయడం అనేది నిజంగా ఒక సవాలుతో కూడిన ప్రక్రియ.
ఈ సమస్యలను ఎదుర్కోవడానికి, మేము టెస్ట్ పేపర్లను రూపొందించడంలో అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని ఒక మేధాయుత వ్యవస్థను అభివృద్ధి చేశాము. ఆ విషయాలు…
- సిలబస్ కవరేజ్
- అంశం యొక్క నాణ్యత
- కఠినతా స్థాయిలు
- గత సంవత్సరపు ట్రెండ్స్
- వివిధ రకాల ప్రశ్నలు
- యూజర్/వినియోగదారు యొక్క భావన ప్రావీణ్యత(వ్యక్తిగతీకరణ)
- యూజర్/వినియోగదారు యొక్క వ్యక్తిగత ప్రొఫైల్(వ్యక్తిగతీకరణ)
దీనివల్ల ఉపాధ్యాయులు తక్కువ సమయంలో ఎక్కువ టెస్ట్ పేపర్లను విద్యార్థుల శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా రూపొందించడానికి వీలవుతుంది. అదే విధంగా ఇది Embibe అభివృద్ది చేసిన టెస్ట్ నాణ్యత స్కోర్ ఆల్గోరిథంను ఉపయోగించి చెక్ చేయబడిన అధిక నాణ్యతను నిర్ధారిస్తుంది.
టెస్ట్ నాణ్యత స్కోర్ మరియు ప్రశ్న వివక్షక కారకం
టెస్ట్ నాణ్యత స్కోర్ అనేది ఉపాధ్యాయులు మరియు సంస్థ ఎంచుకున్న ప్రమాణాలకు మరియు చాప్టర్ల కవరేజీకి అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది.
అంశం యొక్క ప్రతిస్పందన సిద్దాంతం యూజర్/వినియోగదారు ప్రశ్న ప్రయత్నాల డేటాను ఉపయోగించి ప్రశ్నా వివక్ష కారకలను ఆంచాన వేస్తుంది.
మీ స్వంత టెస్ట్‌ను రూపొందించుకోండి
స్వయంగా కూడా టెస్ట్‌ను రూపొందించుకునే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చాం. విద్యార్థికి తన లక్ష్యం లేదా పరీక్షకు అనుగుణంగా సదరు పరీక్షలో చాప్టల ఎంపికతో పాటు కఠినతా స్థాయిని నిర్ణయించుకోవడానికి వీలువుతుంది. ఈ టెస్ట్‌ను వివిధ ప్రోగ్రామ్‌లను ఉపయోగించి తయారు చేస్తారు. విద్యార్థి యొక్క అవరోధాలను వ్యక్తిగతీకరణను సంతృప్తి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది.
డయాగ్నోస్టిక్ టెస్ట్
ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది (i) విద్యార్థి యొక్క సామర్థ్యం మరియు లోపాలను ను తెలియజేస్తుంది,(ii) గ్రౌండ్ ట్రూత్ డేట్ కు అనుగుణంగా ఉంటుంది (iii) సాధ్యమైన అస్సెస్ఏమేంట్ ప్రశ్నలను సాధించవచ్చు. లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కాన్సెప్ట్లపై విద్యార్థి ఎంత ప్రావీణ్యం సంపాదించాడో నిర్ధారించడంలో విద్యార్థికి సహాయపడేందుకు మేము వ్యక్తిగతీకరించిన సాధనతో కూడిన జర్నీలో భాగంగా డయాగ్నోస్టిక్ పరీక్షలను రూపొందిస్తాము. ఇది రెండు పరీక్షలను ఉపయోగించి చేయబడుతుంది.
ముందస్తు టెస్ట్: ఇచ్చిన ప్రశ్నలు ముందు నేర్చుకున్న భావనలు విద్యార్థి లక్ష్యాని సాధించడాని సహాయపడుతుంది.
అచీవ్ టెస్ట్: నిర్దేశిత పరీక్ష మరియు లక్ష్యం కోసం చాలా ముఖ్యమైన అంశాలను కలిగివుండే ప్రశ్నలను అందిస్తుంది.
రెఫెరెన్స్
- Vincent LeBlanc, Michael A. A. Cox, “Interpretation of the point-biserial correlation coefficient in the context of a school examination,” January 2017, The Quantitative Methods for Psychology 13(1):46-56
- Linden, W. D., and R. Hambleton. “Handbook of Modern Item Response Theory.” (1997), Biometrics 54:1680
- Ronald K Hambleton and Wim J Linden. Handbook of modern item response theory. Volume two: Statistical tools. CRC Press, USA, 2016.
- Guang Cen, Yuxiao Dong, Wanlin Gao, Lina Yu, Simon See, Qing Wang, Ying Yang, and Hongbiao Jiang. An implementation of an automatic examination paper generation system. Mathematical and Computer Modelling, 51, 2010.
- Automated Content Packaging via Evolutionary Progressive Query Expansion. In L@S 2020: ACM Symposium on Learning at Scale, May 27–29, 2020,
- https://en.wikipedia.org/wiki/Wasserstein_metric
← AI హోం పేజ్‌కు వెళ్లు