అనువాదం

Embibe అనేది స్కేల్ [5][6]లో అభ్యాస ఫలితాలను అందించే AI ఆధారిత విద్యావేదిక . మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఏ భాషలో చదువుతున్నా వారికి నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నాము. అనువాద ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం భారతదేశంలోని మిలియన్ల మంది విద్యార్థులకు మాతృభాషలో విద్యా విషయాలను అందించడం. విద్యార్థులకు వారి సామర్థ్యానికి అనుగుణంగా నేర్పించడం, సాధనం చేయించడం మరియు మూల్యాంకనం చేస్తాము. అందుకు అనుగుణంగా సమాచారాన్ని సేకరించడం, సృష్టించడం అన్నది చాలా ముఖ్యం [7][8].

ఉత్తమ నాణ్యత కలిగిన విద్యావిషయక కంటెంట్ చాలా వరకు ఆంగ్లంలో అందుబాటులో ఉంది. ఈవిషయాలను మనం స్థానిక  భారతీయ భాషల్లోకి అనువదించగలిగితే అది విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందుకని , మేము   భారతదేశంలోని అన్ని ప్రధాన స్థానిక భాషల కోసం అంతర్గతంగా యంత్రానువాద నమూనాలను రూపొందించాము. ప్రతి మోడల్ విద్యాసంబంధమైన ఆంగ్ల వాక్యాలను  స్వీకరించి  ఉద్దేశిత భాషలోకి  వాక్యాలను అనువాదం  చేస్తుంది.

ప్రస్తుతం, మేము 11 భారతీయ భాషల్లో ఈ అనువాద ప్రక్రియ కొనసాగిస్తున్నాము.

1 .హిందీ

2 .గుజరాతీ

3. మరాఠీ

4. తమిళం

5. తెలుగు

6. బెంగాలీ

7 . కన్నడ

8 అస్సామీ

9 ఒరియా

10 పంజాబీ

11 మలయాళం

Google అనువాదం విద్యా విషయాల కోసం ప్రత్యేకంగా నిర్మించబడనందున కొన్నిసార్లు తప్పులు చేస్తుంది. ఇక్కడ  కొన్ని ఉదాహరణలు:

ఇంగ్లీషుGoogle అనువాదంNMT అనువాదం
which of the following law was given by Einstein:కింది వాటిలో ఐన్స్ స్టీన్ ఇచ్చిన చట్టం ఏది
కిందివాటిలో ఏ నియమాన్ని ఐన్స్ స్టీన్ ప్రతిపాదించాడు
which one of the following is not alkaline earth metal?కిందివాటిలో ఆల్కలీన్ ఎర్త్ మెటల్ కానిది ఏదికిందివాటిలో క్షారీయ భూ లోహం కానిది ఏది
Endogenous antigens are produced by intra-cellular bacteria within a host cell.ఎండోజనిక్ యాన్టిజేన్ లు హోస్ట్ సెల్ లోని ఇంట్రా – సెల్యులార్ బాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడతాయిఏండో జేనిక్ యాన్టిజేన్ లు అతిథి కణం ఉన్న అంతర కణ బ్యాక్టీరియ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి.

ఇప్పుడు, మొదటి నుండి న్యూరల్ యంత్ర  అనువాద నమూనాలను రూపొందించడానికి, మాకు చాలా అంటే  కనీసం కొన్ని మిలియన్ వాక్యాల డేటా అవసరం. కాబట్టి, మేము ఫీడ్‌బ్యాక్ లూప్‌ను రూపొందించాము. అది సమయం గడిచేకొద్దీ మెరుగుపడుతుంది. మేము ఇక్కడ అన్ని భాషలకు చెందిన  విద్యా అనువాదకుల సహాయాన్ని తీసుకున్నాము.

మేము విద్యా అనువాదకులకు యంత్ర-అనువాదిత  వాక్యాలను అందిస్తాము.వారు అవసరమైతే చిన్న సవరణలు చేసి  సరిదిద్దిన  అనువాదాలను అంటే మాకు ఫీడ్‌బ్యాక్ డేటాను అందిస్తారు. అప్పుడు మేము ఈ కొత్త ఫీడ్‌బ్యాక్ డేటాతో మా మోడల్‌కు శిక్షణ ఇస్తాము. ఇప్పుడు, సవరించిన న్యూరల్ యంత్రానువాదిత మోడల్‌లతో, యంత్ర అనువాదిత వాక్యాల నాణ్యత గతంలో  కంటే మెరుగ్గా మారింది.

మొత్తం ప్రాజెక్ట్ యొక్క సంపూర్ణ నిర్మాణాన్ని చూపించే రేఖాచిత్రం ఇక్కడ ఉంది

కాబట్టి, అనువాద సమస్యను పరిష్కరించడానికి, మేము మానవ మేధస్సు మరియు AI రెండింటినీ ఉపయోగిస్తాము.

Embibe యొక్క న్యూరల్ యంత్రానువాద సాంకేతికతను ఉపయోగించడం ద్వారా, విద్యా అనువాదకులు చేయవలసిన పని ~80% తగ్గించబడింది. వారి ఉత్పాదకత అనేక రెట్లు పెరిగింది.

మేము చిత్ర -అనువాద సమస్యను పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తున్నాము, ఇక్కడ ఆంగ్ల లేబుల్‌లతో కూడిన చిత్రం సిస్టమ్‌లోకి అందించబడుతుంది మరియు అవుట్‌పుట్ ఉద్దేశిత భాషలో లేబుల్‌లతో కూడిన చిత్రంగా ఉంటుంది.

ఉదాహరణకు, ఈ ఇన్‌పుట్ చిత్రం:

పై చిత్రం స్వయం చాలితంగా (ఆటోమెటిక్‌గా) కింద ఉన్న అవుట్‌పుట్ చిత్రంగా మారుతుంది.

మేము ఈ అవుట్‌పుట్ చిత్రంలో ఖచ్చితత్వం పెంచడానికి దాని పైన అక్షరాల శైలిలో చిన్న సవరణలు చేసి ఉండవచ్చు.

ఈ ప్రాజెక్ట్ కోసం, మేము మొదట చిత్రం నుండి పదాలను గుర్తించి, ఆపై ప్రతి పదం కోసం OCR చేసాము, ఆపై వాటిని న్యూరల్ యంత్రానువాదిత APIలను ఉపయోగించి అనువదిస్తాము.  చివరగా అనువదించబడిన పదాన్ని చిత్రంలో సంబంధిత స్థలంలో ఉంచుతాము.

← AI హోం పేజ్‌కు వెళ్లు