EMBIBE స్కోర్ కోషియెంట్ ; ఫలితాల మెరుగుదలకై మెషీన్ ఆధారిత అభ్యాసం

EMBIBE స్కోర్ కోషియెంట్ ; ఫలితాల మెరుగుదలకై మెషీన్ ఆధారిత అభ్యాసం

మెరుగుదల ఉంటేనే దానిని కొలవగలం అన్నది మా నమ్మకం. అలాగే మనం కొలవగలిగేది తప్పకుండా మెరుగుపరచవచ్చు. Embibe స్కోర్ కోషియెంట్ అనేది కేవలం ఒక సంఖ్యారూపమైన పరామితి. ఇది పరీక్షలో  విద్యార్థులు మార్కులు సంపాదించే సామర్థ్యాన్ని అంచనా వేయచ్చు. Embibe స్కోర్ కోషియెంట్ ఈ కింది లక్షణాలను కలిగి ఉంటుంది.

  • ప్రతిబింబించు: Embibe స్కోర్ కోషియెంట్ అనేది విద్యార్థి యొక్క సామర్థ్యతను వారి లేటెంట్ అట్రిబ్యూట్స్ ఆధారంగా ప్రతిబింబిస్తుంది.
  • ఊహించు: ప్రస్తుతం విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఊహిస్తుంది.
  • ధృడత్వం: ఎక్కువ మార్కులు వచ్చినా ఒక టెస్ట్ లేదా తక్కువ మార్కులు వచ్చిన టెస్ట్ అనేది విద్యార్థి యొక్క స్కోర్ కోషియెంట్‌ని ప్రభావితం చేయకూడదు.
  • సాధారణం: టెస్ట్ కఠినతర స్థాయిలకు దోహదపడే కారకం.

Embibe విద్యార్థి యొక్క స్కోర్ కోషియెంట్‌ని అంచనా వేయడానికి అల్గారిథం ఆధారిత పరామితులను ఉపయోగిస్తుంది. అలాగే ఈ కింది వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటుంది.

  • లేటెంట్ అట్రిబ్యూట్స్; లేటెంట్ అట్రిబ్యూట్స్ లేదా ఫీచర్స్ అనేవి Embibe స్కోర్ కోషియెంట్‌ ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ లేటెంట్ అట్రిబ్యూట్స్ అనేవి అటెంప్ట్ లెవెల్ నుంచి ఉత్పన్నమవుతాయి.
  • ఉత్తమ సెషన్స్; N అనేది విద్యార్థి యొక్క ఉత్తమ టెస్ట్ లేదా ప్రాక్టీస్ సెషన్ అని భావిస్తే ఆ N Embibe స్కోర్ కోషియెంట్‌ని ప్రతిబింబించడమే కాదు.. అంతే ధృఢంగా కూడా ఉండేలా చేస్తుంది. విద్యార్థి పెర్ఫార్మెన్స్‌కి అద్దం పడుతుంది. అలాగే తదుపరి వృద్ధి అనేది వారి మార్కుల పెరుగుదలలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
  • తాజా సెషన్స్; గత K టెస్ట్స్ లేదా ప్రాక్టీస్ సెషన్స్ ఆధారంగా Embibe స్కోర్ కోషియెంట్ అనేది ఊహాత్మకంగా మరియు విద్యార్థి యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక సాధారణ సెషన్ స్కోర్ ప్రతిసారీ పెరుగుతూ ఉంటే విద్యార్థి యొక్క ప్రతిభ కూడా క్రమంగా మెరుగవుతుందని అర్థం.

Embibe స్కోర్ కోషియెంట్ అనేది ప్రధానంగా మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. అవి అకడమిక్, బిహేవియరల్ మరియు టెస్ట్ తీసుకోవడం. ఈ భిన్నమైన అంశాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.

Embibe స్కోర్ కోషియెంట్ ~ విద్యా కోషియెంట్ + ప్రవర్తనా కోషియెంట్ + టెస్ట్ టేకింగ్ కోషియెంట్

ఈ ఆర్టికల్‌లో ఇప్పటివరకు చదివినది మేం దాదాపు కొన్ని పదుల సంఖ్యలో వేల టెస్ట్ సెషన్లను చాలా అకడమిక్ సీజన్ల నుంచి పరిశీలించి చెప్పినది. ఒక టెస్ట్ సెషన్‌లో ఒక విద్యార్థి కనీసం గడపాల్సిన సమయం గడిపితేనే అది వ్యాలిడ్ టెస్ట్ అవుతుంది. అలాగే ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిన కొన్ని ప్రశ్నలను కూడా చేయాల్సి ఉంటుంది.

విద్య కోషియెంట్ అనేది సబ్జెక్ట్‌పరమైన విజ్ఞానాన్ని సూచిస్తుంది. విద్యార్థులు వారి విద్య కోషియెంట్‌ని వరుస టెస్ట్స్‌తో హైపర్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఫీడ్‌బ్యాక్ సహాయంతో మరింత మెరుగుపరచుకోవచ్చు. ఇది వ్యక్తిగతీకరించిన టెస్ట్స్ ఫలితాలను అందించడం ద్వారా విద్యార్థి యొక్క విద్యాపరమైన బలహీనతలను క్రమంగా తొలగిస్తుంది. ఫలితంగా విద్యార్థి యొక్క విద్య కోషియెంట్‌లో చక్కని మెరుగుదల కనిపిస్తుంది. దీనిని చిత్రం 1లో మీరు చూడచ్చు.

ప్రవర్తన కోషియెంట్ అనేది విద్యార్థి యొక్క ఉద్దేశాన్ని సూచిస్తుంది. అధిక మార్కులు సంపాదించేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నారు? ఏకాగ్రత స్థాయి, అంకితభావం ఎంతవరకు ఉంది.. అనే అంశాల గురించి ఇది చెబుతుంది. విద్యార్థి ఎక్కడ వెనుకబడుతున్నారో తెలిస్తే వారిని ప్రవర్తనాపరమైన కోషియెంట్‌లో భాగంగా దానిని మరింత మెరుగుపరచుకొనే అవకాశం ఉంటుంది. దీనిని మీరు చిత్రం 2లో చూడవచ్చు. మొదట్లో ప్రవర్తనాపరమైన మెరుగుదల అనేది చాలా వేగంగా కనిపించినా తర్వాత స్థాయిలో దాని వేగం నెమ్మదిస్తుంది. కానీ నిదానమే ప్రధానంగా ప్రతి టెస్ట్ తర్వాత ఎంతో కొంత మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది.

టెస్ట్ టేకింగ్ కోషియెంట్ అనేది టెస్ట్ సెషన్‌లో సమయపాలన మరియు ప్రశ్నల ప్రాధాన్యతను సూచిస్తుంది. టెస్ట్ టేకింగ్ కోషియెంట్‌ని సహజంగా మెరుగుపరచుకోవడం ద్వారా Embibe కోషియెంట్ స్కోర్‌ని ఉత్తమమైన టెస్ట్ టేకింగ్ వ్యూహాలతో జత చేసి మంచి అభ్యాస ఫలితాలను పొందవచ్చు. టెస్ట్ టేకింగ్ కోషియెంట్‌లో మెరుగుదల అనేది మొదట వేగవంతం అయినా తర్వాత వేగం నెమ్మదించి నిదానంగా ఉంటుంది.

Embibe స్కోర్ కోషియెంట్ నుంచి విద్య, ప్రవర్తన మరియు టెస్ట్ టేకింగ్ కోషియెంట్స్ అనేవి ప్రభావవంతమైన సిఫార్సులను చేస్తూ ఉత్తమమైన అభ్యాస ఫలితాలను అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

రెఫెరెన్స్:

  • Faldu K., Thomas A., Donda C. and Avasthi A., “Behavioural nudges that work for learning outcomes”, Data Science Lab, Embibe, https://www.embibe.com/ai-detail?id=2, 2016.
  • Faldu, K., Avasthi, A. and Thomas, A., Indiavidual Learning Pvt Ltd, 2020. Adaptive learning machine for score improvement and parts thereof. U.S. Patent 10,854,099.
  • Donda, C., Dasgupta, S., Dhavala, S. S., Faldu, K., & Avasthi, A. (2020). A framework for predicting, interpreting, and improving Learning Outcomes. arXiv preprint arXiv:2010.02629.