పోటీతత్వ స్థాయులను పెంచడానికి డైనమిక్ మరియు అనుసరణీయ అభ్యాసం

మాతో కలిసి పరిష్కరించండి’తో కలిసిన మా రికమెండేషన్ ఇంజిన్ ‘ప్రాక్టీస్’ ద్వారా విద్యార్థులకు చక్కని విజ్ఞానాన్ని అందిస్తుంది

యాజమాన్యం అందించే ‘మాతో కలిసి పరిష్కరించండి’ ప్రాక్టీస్ తో కలిపిన మా సిఫార్సు విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచుకోవడంలో బాగా సహాయపడుతుంది.

Embibe ప్రాక్టీస్ ఫీచర్‌లో బోధనా శాస్త్రంలో టాప్ ర్యాంక్ లో ఉన్న 1000+ పుస్తకాలకు సంబంధించిన అత్యాధునికమైన 10 లక్షల + ఇంటరాక్టివ్ ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ అధ్యాయాలు మరియు టాపిక్స్‌కు సంబంధించినవి. అలాగే లోతైన విజ్ఞాన అన్వేషణ ద్వారా ప్రతి విద్యార్థికీ ప్రత్యేకమైన మరియు వ్యక్తిగత సామర్థ్యాన్ని అనుసరించి ప్రాక్టీస్ విధానాన్ని రూపొందిస్తుంది. ప్రాక్టీస్ యొక్క ముఖ్య లక్షణాలు ఈ కింది విధంగా ఉన్నాయి…

  1.  ప్రాక్టీస్ అనేది ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన గ్రాన్యులరైజేషన్ ద్వారా ప్రతి ప్రశ్నను 63 కంటే ఎక్కువగా ట్యాగ్ చేయదగిన ఎలిమెంట్స్‌గా విభజిస్తుంది. తద్వారా ప్రశ్నను పరిష్కరించే ప్రతి దశను సూక్ష్మస్థాయిలో వ్యక్తిగతపరంగా వివరించవచ్చు.
  2. ప్రాక్టీస్ అనేది వినూత్నమైంది. ఇది బోధనాశాస్త్రంలో యాజమాన్యం అందించే ‘మాతో కలిసి పరిష్కరించండి’ అనే పద్ధతిని ఉపయోగిస్తుంది.
  3. ఇది ప్రాక్టీస్‌లో ఉన్న కంటెంట్ అంతటినీ 74000+ అంశాలకు చెందిన Embibe యొక్క గ్రాఫ్‌లకు అనుసంధానం చేస్తుంది.
  4. ఇది మొత్తం కంటెంట్‌ని K-12, కళాశాల ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ/ ప్రభుత్వ పరీక్షలతో కలిపి 310 పరీక్షలను అందిస్తుంది.
  5. సాల్వర్స్ మరియు టెంప్లేట్లను ఉపయోగిస్తూ రన్ టైమ్‌లో క్రియాశీలమైన మరియు వ్యక్తిగతపరమైన ప్రశ్నలను ఉత్పత్తి చేస్తుంది.
  6. ఇది NLP ఆధారంగా పదమూల్యాంకనాన్ని ఉపయోగిస్తుంది. దీర్ఘమైన వ్యక్తీకరణలు, పదబంధాలు మరియు పెద్ద సమాధానాలను ఆటోమేటిక్‌గా చదవగలరు.
  7. లెర్నింగ్ కోసం సిఫార్సును ఉపయోగించడం ద్వారా ఏదైనా అంశం లేదా ప్రశ్న విషయంలో విద్యార్థి ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు వీడియోలు లేదా సూచనల ద్వారా వారికి ఆటోమేటిక్‌గా సహాయం అందిస్తుంది. 
  8. విద్యార్థుల అవసరాలు మరియు వారి పాఠ్యప్రణాళిక అనుగుణంగా వారికి వివిధ అంశాలకు సంబంధంచిన ప్రశ్నలను ‘ప్రాక్టీస్’ ద్వారా అభ్యాసం చేసేందుకు అందిస్తుంది. వీటికి సంబంధించిన పరిష్కారాలు/సమాధానాలు Embibeలో ఉన్న నిపుణులు అందిస్తారు.
  9. ‘బుక్స్ విత్ వీడియోస్ అండ్ సొల్యుషన్స్’, ‘బిగ్ బుక్స్’ లేదా ‘ప్రాక్టీస్ చాప్టర్స్’ ద్వారా విద్యార్థులు వారి అవసరాలకు అనుగుణంగా అధ్యాయాలవారీగా లేదా అంశాల వారీగా ఈ అభ్యాస ప్రశ్నలను యాక్సెస్ చేయవచ్చు. ‘మాతో కలిసి పరిష్కరించండి’ ఫీచర్ విద్యార్థులకు ప్రశ్నల స్థాయిలో అవసరమైన సూచలను అందిస్తుంది. అలాగే సూక్ష్మస్థాయిలో సూచలను అందించడం వల్ల వారు ప్రశ్నలను సులభంగా పరిష్కరించగలుగుతారు. అప్పటికీ విద్యార్థులు వాటిని పరిష్కరించలేకపోతే ప్రతి ప్రశ్నకీ వివరణాత్మక పరిష్కారం అందుబాటులోనే ఉంటుంది.
  10. ‘ఇంపార్టెంట్’, ‘డిఫికల్టీ’ మరియు ‘లెంథీనెస్’ అనే ట్యాగ్స్ విద్యార్థులు ముఖ్యమైన అధ్యాయాలు, అంశాలు మరిచిపోకుండా సహాయపడుతుంది. అలాగే కఠినతర స్థాయి మరియు లెంథీనెస్ ఆధారంగా విద్యార్థులు అధ్యాయాలను ప్రాధాన్యాల ప్రకారం చదువుకోవచ్చు.
  11. విద్యార్థులు ఉపయోగించే పుస్తకాలు మరియు ప్రముఖ రచయితలు రచించినవి మా వేదిక పై ఓ క్రమపద్ధతిలో ప్రదర్శించాం. ఒక పుస్తకం ఎంత బాగా ప్రాచుర్యం పొందితే దాని ర్యాంకు అంత ఎక్కువగా అది ర్యాంక్ సంపాదించుకుంటుంది. దాని ప్రకారమే మా వేదిక మీద క్రమబద్ధీకరించబడుతుంది.
  12. పరీక్ష సిలబస్, గత ఏడాది పరీక్షా పత్రాల పద్ధతులు మరియు సూచించిన టెక్ట్స్ లేదా ఆ పరీక్ష లేదా గ్రేడ్‌కి సంబంధించిన ప్రముఖ పుస్తకాల అధ్యయనం ద్వారా Embibe సిలబస్ రూపొందించబడింది. ఒక పుస్తకంలో ఇచ్చిన అభ్యాసం అందులోని సిలబస్ ఆధారంగానే ఉంటుంది. ‘ప్రాక్టీస్ త్రూ చాప్టర్స్’, ‘Embibe బిగ్ బుక్’ మరియు ‘టెస్ట్’లలో అనుసరించిన సిలబస్ Embibe సిలబస్ అవుతుంది.

అటెంప్ట్ క్వాలిటీలో ఉన్న ఏడు జార్లు ఈ కింది రకాలుగా సమాధానాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి;

టూ ఫాస్ట్ కరెక్ట్: ఒక విద్యార్థి ప్రశ్నకు ఇచ్చిన సమయంలో 25% కంటే తక్కువ సమయంలోనే సరిగ్గా సమాధానం చెబితే టూ ఫాస్ట్ కరెక్ట్ విభాగంలోకి వస్తుంది.

పర్ఫెక్ట్ అటెంప్ట్: ఒక విద్యార్థి ఇచ్చిన సమయంలో 25% కంటే ఎక్కువ సమయం తీసుకుని సరైన సమాధానం చెబితే పర్ఫెక్ట్ అటెంప్ట్ విభాగంలోకి వస్తుంది.

ఓవర్‌టైమ్ కరెక్ట్ అటెంప్ట్: విద్యార్థి ఒక ప్రశ్నకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుని సరైన సమాధానం చెబితే ఓవర్‌టైమ్ కరెక్ట్ అటెంప్ట్ విభాగంలోకి వస్తుంది.

వేస్టెడ్ అటెంప్ట్:విద్యార్థి ఇచ్చిన సమయంలో 25% కంటే తక్కువ సమయం తీసుకుని ప్రశ్నకు తప్పు సమాధానం చెబితే వేస్టెడ్ అటెంప్ట్ విభాగంలోకి వస్తుంది.

ఇన్‌కరెక్ట్ అటెంప్ట్: విద్యార్థి ఇచ్చిన సమయంలో 25% కంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ తప్పు సమాధానం చెబితే ఇన్‌కరెక్ట్ అటెంప్ట్ విభాగంలోకి వస్తుంది.

ఓవర్‌టైమ్ ఇన్‌కరెక్ట్ అటెంప్ట్: ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ తప్పు సమాధానం చెబితే ఓవర్‌టైమ్ ఇన్‌కరెక్ట్ విభాగంలోకి వస్తుంది.

అన్‌అటెంప్టెడ్: అటెంప్ట్ చేయకుండా వదిలేసిన లేదా మిస్ అయిన సమాధానాలకు మార్కులు రావు. విద్యార్థి సందేహాత్మకంగా ఉన్న ప్రశ్నల విషయంలో లేదా ఎలాంటి ఐడియా లేని ప్రశ్నలకు సంబంధించినప్పుడు దానిని ఖాళీగా వదిలేస్తారు.

ప్రతి విద్యార్థి భిన్నమే మరియు వారి నేర్చుకునే విధానం కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. వారు నేర్చుకునే దశ మరియు ప్రాక్టీస్‌లో వారి పెర్ఫార్మెన్స్ బట్టి వారికి కొన్ని సలహాలు అవసరం అవుతాయి. రికమెండెడ్ లెర్నింగ్ ద్వారా Embibe వేదిక మీద విద్యార్థులకు వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగా వ్యక్తిగతపరమైన విద్యను అందిస్తుంది. ఇలా వ్యక్తిగతీకరించబడిన విద్య ద్వారా విద్యార్థులు అభివృద్ధి చెందుతారని సూచిస్తుంది. నాలెడ్జ్ గ్రాఫ్‌ల సహాయంతో Embibe విద్యార్థులకు చక్కని అవగాహన కల్పించేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలను అందిస్తుంది. ‘నెక్స్ట్ క్వశ్చన్ ఇంజిన్’ విద్యార్థి యొక్క కఠినత స్థాయికి దగ్గర్లో ఉన్న ప్రశ్నలను అందించడం ద్వారా విద్యార్థి అభివృద్ధి అయ్యేందుకు తోడ్పడుతుంది.