విద్యార్థి విజ్ఞాన స్థాయి మరియు ప్రవర్తనా విధానాలను తెలుసుకోవడం ద్వారా వారి మార్కుల సాధనా సామర్థ్యాన్ని కొలవడం

Embibe స్కోర్ కోషియెంట్ అనేది విద్యార్థి ఒక టెస్ట్‌లో ఎంత స్కోర్ చేయగలరో ఊహించడానికి సహాయపడే మెకానిజం

‘‘అందరూ తెలివైనవారే. కానీ ఒక చేప యొక్క సామర్థ్యాన్ని అది చెట్టు ఎక్కగలగడం ద్వారా నిర్ణయించాలని ప్రయత్నిస్తే; దాని జీవితం అంతా  తనని తాను అసమర్థ జీవిగా భావిస్తూనే ఉంటుంది’’ – ఐన్‌స్టైన్

ఈ ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కష్టాలను తెలిజేస్తుంది. ప్రతిభకు నిదర్శనంగా కేవలం పరీక్షలను మాత్రమే విద్యా వ్యవస్థలు మరియు రిక్రూటర్లు పరిగణిస్తున్నారు. ఏడాదంతా బాగా చదవినా లేక అసలు చదవకపోయినా, ఒక విద్యార్థి పరీక్షలో ఏం రాశాడు అన్నదే ఇక్కడ అంతిమ విషయం. ఈ కష్టాలకు తోడు నాణ్యత గల ఉపాధ్యాయులకు గల డిమాండ్ మరియు అందుబాటులో ఉన్న అటువంటి వారి సంఖ్య ప్రాంతాల వారిగా చాలా తేడా ఉంటోంది. ఫలితంగా విద్యార్థులు – ఉపాధ్యాయుల నిష్పత్తిలో చాలా అంతరం కనిపిస్తోంది. ఈ కారణంగా ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికీ వ్యక్తిగతపరమైన విద్యను అందించలేరు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి విద్యార్థులకు వారికి ఏమి అవసరమో, ఎప్పుడు అవసరమో గమనిస్తూ వాటిని వారికి అనుకూల సమయాల్లో అందించాలి. అప్పుడే వారు తమ పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా చదవగలరు.

దీనిని సాధించడానికి Embibe విద్యార్థుల యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని ‘Embibe స్కోర్ కోషియెంట్’ అని పిలువబడే శాస్త్రీయ పద్దతి ద్వారా అంచనా వేయబడుతుంది. ఒక విద్యార్థి మార్కులు సాధించే సామర్థ్యం మొత్తంగా అతను/ఆమె విద్యా నైపుణ్యం మరియు ప్రవర్తన వంటి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. పరీక్షలో తక్కువ మార్కులు రావడానికి గల అంశాల గురించి నిశితంగా తెలుసుకునేందుకు ఇది సహాయపడుతుంది.

మా వ్యవస్థ ద్వారా అప్పటికప్పుడు సిఫార్సులు అందించడానికి ఉపయోగపడే ‘Embibe స్కోర్ కోషియెంట్’లోని ప్రధాన భాగాలు ఇవే

  1. విద్యా కోషియెంట్; ఇది విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాన్ని సూచిస్తుంది. Embibeలో ఒక విద్యార్థి యొక్క విద్యా సామర్థ్యాన్ని ‘కాన్సెప్ట్ మాస్టరీ’ ద్వారా గణిస్తారు. ఒక అంశంలో విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని వీడియోలు చూడడం, ప్రశ్నలను అభ్యాసం చేయడం, టెస్ట్స్ తీసుకోవడం మరియు టెస్ట్ ఫీడ్‌బ్యాక్‌ని సమీక్షించుకోవడం.. వంటి వివిధ కృత్యాల ద్వారా ‘కాన్సెప్ట్ మాస్టరీ’ అంచనా వేస్తుంది.
  2. ప్రవర్తనా కోషియెంట్: టెస్ట్ తీసుకోవడం ద్వారా ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనా పరమైన లక్షణాలను సూచిస్తుంది. ఇందులో ఉప విభాగాలు ఉన్నాయి. 
  3. ప్రయత్న కోషియెంట్ ; నేర్చుకునే ప్రక్రియలో విద్యార్థులు చేసే ప్రయత్న శ్రమను ఇది సూచిస్తుంది. ప్రయత్న కోషియెంట్ పరీక్షల్లో విద్యార్థులు ఎంతవరకు స్కోర్ చేయగలరనేది ఊహించడానికి సహాయపడుతుంది. ఈ విభాగంలో పరిగణించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ప్రాక్టీస్ సెషన్ల సంఖ్య, ప్రాక్టీస్‌లో గడిపిన మొత్తం సమయం మరియు ఇతర సారూప్య లక్షణాలు.

ఇక ప్రవర్తనా కోషియెంట్‌లో ఉన్న ఉప విభాగాల వివరాలకు వస్తే…

  • ఇంటెంట్ కోషియెంట్: విద్యార్థి యొక్క విజ్ఞానంతో సంబంధం లేకుండా వారికి ఉన్న ఇంటెంట్ లేదా పాండిత్య సంబంధమైన కోషియెంట్‌ని ఇంటెంట్ కోషియెంట్ అంటారు. ఈ విభాగంలో పరిగణించే సంపూర్ణ లక్షణాలు కొన్ని ఏవంటే- వేస్టెడ్ అటెంప్ట్స్ సంఖ్య, సబ్జెక్ట్ స్వాప్స్, ఏ ప్రశ్న ప్రయత్నించకుండా గడిపిన సమయం మరియు ఇలాంటి సారూప్య లక్షణాలు.
  • టెస్ట్ తీసుకునే నైపుణ్యాల కోషియెంట్:టెస్ట్ తీసుకునే నైపుణ్యాల కోషియెంట్ అనేది విద్యార్థి టెస్ట్ తీసుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ విభాగంలో పరిగణించే కొన్ని లక్షణాలు ఏవంటే- చూసిన ప్రశ్నల సంఖ్య మరియు రివ్యూ కోసం మార్క్ చేసిన ప్రశ్నల సంఖ్య.

మిషన్ లర్నింగ్ నమూనా

వాస్తవికత యొక్క ఒక అంచనా. పరిమాణాత్మకంగా లేదా సహజ భాషలో వాస్తవికతను తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పారదర్శకమైన లోతైన అభ్యాస నమూనాలకు కూడా ఇక్కడ చక్కని వివరణలు ఉంటాయి. ఈ వివరణలను దృష్టిలో పెట్టుకుని ‘Embibe స్కోర్ కోషియెంట్’ అనేది వివరణాత్మక లక్షణాల ఆధారంగా అప్పటికప్పుడు సిఫార్సులను విద్యార్థులకు అందిస్తుంది. ఈ సిఫార్సుల ద్వారా విద్యార్థులకు వారి బలహీన అంశాలు మరియు ప్రవర్తనాపరమైన ఫీడ్‌బ్యాక్‌ని అందిస్తుంది. ఇవి బాగా సూక్ష్మ స్థాయిలో ఉండటం వల్ల వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

రెఫెరెన్స్:

[1] Keyur Faldu, Aditi Avasthi, and Achint Thomas. Adaptive learning machine for score improvement and parts thereof, US Patent No. 10854099 B2.

[2] C. Rudin. Stop Explaining Black-Box Machine Learning Models for High Stakes Decisions and Use Interpretable Models Instead. arXiv e-prints, 11 2018.