బహు మేథాసంపత్తి అనేది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయులు మరియు గైడ్స్ ప్రతి విద్యార్థి యొక్క మేథా స్థాయి పై అవగాహన ఉండాలి. అప్పుడే విద్యార్థుల లెర్నింగ్ అనుభవాన్ని వారికి మరింత సులభంగా అర్థమయ్యే కార్యాచరణల ద్వారా గైడ్ చేసేందుకు ఉపాధ్యాయులకు అవకాశం లభిస్తుంది.
పిల్లలకు ముందే ఉన్న మేథా స్థాయుల గురించి తెలుసుకోవడం ద్వారా వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అధ్యాపకులు తమ బోధనా వ్యూహాలను రచించుకుంటారు. ఈ విధంగా వ్యక్తిగతపరమైన విద్యను అందించే అవకాశం ఉంటుంది. బహు మేథాసంపత్తి సిద్ధాంతం ప్రకారం మేథస్సు యొక్క పద్ధతులు ఈ విధంగా ఉన్నాయి.
1.దృశ్యపరమైన మేథస్సు: వస్తువులు లేదా చర్యలను చూడడం ద్వారా నేర్చుకునే సామర్థ్యం అలవరిచే మేథస్సు. వాటిని చూడడం, తిప్పడం లేదా మార్చడం లేదా మార్పులు చేయడానికి ప్రయత్నించడం.. వంటివి ఈ కోవకు చెందుతాయి. ఇంజినీర్లు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, నటులు, పెయింటర్లు, ఆర్టిస్ట్స్.. మొదలైన వారు దృశ్యపరమైన మేథస్సుతో పని చేసేవారే. దీనిలో ఈ కింది సామర్థ్యాలు వ్యక్తిగతంగా అనుభవంలోకి వస్తాయి.
- బాహ్యప్రభావం లేకుండా వ్యక్తిగతమైన అనుభవాలు, ఆలోచనలు లేదా ఊహల ద్వారా చిత్రాలను గీయడం
- 3D లో నిర్మాణాన్ని ఊహించడం మరియు దాని సంగ్రహించిన వెర్షన్‌ని గీయడం
2. మాటలు- భాషాపరమైన మేథస్సు: పదాలను ప్రభావవంతంగా ఉపయోగించడానికి దోహదపడే మేథస్సు. అంటే వేరే భాష నేర్చుకోవడం అని అర్థం కాదు. ఒక భాష మాట్లాడేవారే అయినప్పటికీ వారికి భాషా సంబంధమైన మేథస్సు అధికంగా ఉంటుంది. సరైన పదాలను ఉపయోగించడం మరియు భావం మారిపోకుండా ఉద్దేశం వివరించడం అనేది ఒక అసమాన నైపుణ్యం. ఇది చాలా సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది.
3. లాజికల్ మేథస్సు అనేది ఇతర మేథస్సు రకాలలో చాలా ముఖ్యమైంది. ఇందులోకి ఏమేమి వస్తాయంటే;
- సంగ్రహించే ఆలోచనా విధానాలు
- సంఖ్యలు మరియు అంకగణిత ఆపరేషన్స్
- ప్రయోగాలు మరియు పరిశోధనలు నిర్వహించడం
- లాజిక్ మరియు వ్యూహాత్మక ఆటలు ఆడడం
- పజిల్స్, పద్ధతులు మరియు సంబంధాలను అర్థం చేసుకోవడం
4. బాడినలీ-కైనెస్థెటిక్ మేథస్సు: లేదా చేతులతో నేర్చుకోవడం లేదా భౌతిక అభ్యాసం అనేది తరచూ నటులు, క్రీడాకారులు, నాట్య కళాకారులు మరియు మెడికల్ సర్జన్లలో మనం గమనించవచ్చు. వీరికి చాలా అద్భుతమైన భౌతిక సమన్వయం కలిగి ఉంటారు. అలాగే వీరు చూడడం లేదా వినడం ద్వారా కాకుండా చేయడం ద్వారా గుర్తుంచుకుంటారు.
5. సంగీతపరమైన మేథస్సు: అంటే సంగీతం మరియు రిథమ్స్ సహకారంతో చదవడం. ఈ విధమైన మేథస్సు కలిగినవారు కాస్త గుసగుసలాడడం, చదువుతున్నప్పుడు కాళ్లు చేతులు ఆడిస్తూ హమ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇవి వారి దృష్టిని మరింత కేంద్రీకరించేలా చేస్తాయి. సంగీతం కారణంగా దృష్టి మరలడం కాకుండా అది వారికి మరింత చక్కని ఏకాగ్రతతో చదివేందుకు తోడ్పడుతుంది.
6. అంతర్గత వ్యక్తిగత మేథస్సు: అనేది విడిగా ఉన్నప్పుడు పని చేస్తుంది. ఈ తరహా మేథస్సు ఉన్నవారు ఒంటరిగా పని చేయడానికి ఇష్టపడతారు. వీరు వ్యక్తులతో కలిసి పని చేస్తూ నేర్చుకునేవారికి వ్యతిరేకంగా ఉంటారు. వీరు స్వయం ప్రేరేపిత విద్యార్థులు. వీరంతట వీరే కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరేందుకు చదువు మీద దృష్టి సారిస్తారు. ఇతరులు అందించే సలహాలు, వారు చెప్పే మాటలు. ఇవేవీ వీరిని ప్రభావితం చేయవు. ఉదాహరణకు ఒక పిల్లాడికి ఏవియేషన్ అంటే బాగా ఇష్టం అనుకుందాం. అటువంటప్పుడు తల్లిదండ్రులు టైమ్‌లైన్‌లో ఏవియేషన్ హిస్టరీ క్రియేట్ చేయచ్చు లేదా ఇతర కార్యకలాపాల్లో క్షేత్రస్థాయిలో ముఖ్యమైన ఫీచర్ల జాబితా రూపొందించడం. ప్రకృతికి దగ్గరగా వెళ్లే క్షేత్రస్థాయి పర్యటనలు కూడా అంతర్గత అభ్యాసకులకు బాగా ఉపయోగపడుతుంది.
7. అంతరవ్యక్తిగత మేథస్సు: అనేది అందరితోనూ కలిసి నేర్చుకోవాలనే విద్యార్థులలో మనం గమనించవచ్చు. చుట్టూ ఉన్నవారిని గమనించేవారు మరియు పరిసరాల నుంచి నేర్చుకునేవారు, ఒక భాగస్వామి లేదా సమూహం నుంచి నేర్చుకోవడానికి ఆసక్తి చూపేవారు ఈ తరహా మేథస్సుని కలిగి ఉంటారు. కమిటీలకు వెళ్లేందుకు, సమూహంతో కలిసి ప్రాజెక్ట్‌లను నేర్చుకోవడానికి, ఇతర అభ్యాసకులు మరియు పెద్దలతో చర్చించడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఇతురులతో కలిసి పని చేయడం లేదా ఒక వ్యక్తిని ముఖాముఖీ చేయడం ద్వారా అభ్యాసకులు ఇక్కడ ఎక్కువగా నేర్చుకుంటారు. వారు నేర్చుకున్న విద్య ద్వారా ఇతరులకు సహాయపడేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు.
8. సహజ మేథస్సు :అనేది బాహ్యప్రదేశాల్లో పని చేస్తుంది. ఏ పిల్లలైతే బయటకు వెళ్లడానికి ఇష్టపడతారో లేక జంతువులు మరియు క్షేత్రస్థాయి ప్రదర్శనలకు ఆసక్తి చూపిస్తారో వారికి ఈ విధమైన మేథస్సు ఉంటుంది. వీరు ప్రకృతితో అనేక విధాలుగా అనుసంధానమై ఉంటారు. మొక్కలు, జంతువులు, రాళ్లు.. వంటి బయోటిక్ మరియు ఎబయోటిక్ కాంపొనెంట్స్‌ని వీరు చాలా బాగా ఇష్టపడతారు. క్యాంపింగ్, హైకింగ్ మరియు రాళ్లు ఎక్కడం వంటి సాహస కృత్యాల్లో కూడా వీరు బాగా ఆసక్తి చూపిస్తారు.
9. అస్థిత్వ మేథస్సు: విద్యార్థులను జీవితం పట్ల వారి కంటూ ఒక ప్రత్యేకమైన అవగాహన ఏర్పరుచుకునేలా ప్రోత్సహిస్తుంది. ఒక అస్థిత్వవాది తరగతి గదిలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మనోభావాలపై దృష్టి పెట్టే స్కూల్స్‌ని ప్రోత్సహిస్తారు. వారి ఇష్టప్రకారం చదువుకునే స్వేచ్ఛని వారు కోరుకుంటారు. అస్థిత్వవాదం అనేదానిని తత్వవేత్త జీన్ పాల్ సర్టెర్ వృద్ధి చేశారు. ఇది విద్యా వ్యవస్థలో బోధన మరియు అభ్యాస తత్వాలపై విద్యార్థులు దృష్టి పెట్టేలా చేస్తుంది. స్వేచ్ఛ మరియు శక్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు వారి బంగారు భవితకు బాటలు పరుచుకునేలా ప్రోత్సహిస్తుంది. అస్థిత్వ విద్యావేత్తలు ఏ దేవుడో లేదా ఉన్నత శక్తి విద్యార్థులకు మార్గదర్శకం చేస్తుందని నమ్ముతారు.
Embibe ప్రోడక్ట్/ఫీచర్స్:లెర్న్ వీడియో కేటగిరీస్, Mb
Embibeలో ఉన్న అభ్యాస కంటెంట్ మొత్తాన్ని కృత్రిమ మేథస్సు సహాయంతో 74,000+ అంశాలను నాలెడ్జ్ గ్రాఫ్‌ల రూపంలో మార్చింది. అన్ని తరగతులు, పరీక్షలు మరియు లక్ష్యాలకు అనుగుణంగా ఇది బహుమేథాసంపత్తులను ఆచరణలో పెట్టేలా చేస్తుంది. ‘లెర్న్’ కంటెంట్‌లో ఉన్న లోతైన కొలతా పరికరాలను Embibe అభివృద్ధి చేసింది. వీటి ద్వారా అభ్యాసకుల్లో ఉన్న సూక్ష్మస్థాయి అంతరాలను కూడా గుర్తించి వాటికి అనుగుణంగా వారిని మరింత మెరుగయ్యే దిశగా అడుగులు వేసేందుకు ఉపకరించే కంటెంట్‌ని అందిస్తుంది.