‘‘అన్‌స్కూలింగ్’’ అనే పదాన్ని విద్యావేత్త జాన్ హాల్ట్ 1970లలో ప్రతిపాదించారు. సహజ శైలి అయిన ఈ లెర్నింగ్ ప్రక్రియలో పిల్లలు వారి సహజసిద్ధమైన జీవిత అనుభవాలు మరియు రోజువారీ కార్యకలాపాల నుంచి నేర్చుకుంటారు. అన్‌స్కూలింగ్ అనేది ఎలాంటి కరిక్యులమ్ లేని ఆచరణాత్మక హోం స్కూలింగ్. ఈ లెర్నింగ్ పద్ధతి ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న కార్యకలాపాల ద్వారా జ్నానం పొందడం మరియు నైపుణ్యాలను అభివ్రుద్ధి చేసుకోవడాన్ని సూచిస్తుంది. అన్‌స్కూలింగ్‌లో వివిధ రోజువారీ కార్యకలాపాలు మరియు అనుభవాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. ఆటలు, ఇంటి బాధ్యతలు, వ్యక్తిగత అభిరుచులు మరియు ఆసక్తులు, ఇంటర్న్‌షిప్స్ మరియు పని అనుభవం, ప్రయాణం, పుస్తకాలు, ఎంపిక చేసిన తరగతులు, మెంటర్లు మరియు సామాజిక చర్చ.. మొదలైనవన్నీ ఇందులో భాగమే.
అన్‌స్కూలింగ్ ప్రతిపాదకులు సంప్రదాయ స్కూళ్లు మరియు కరిక్యులమ్ ఆధారిత లెర్నింగ్ విధానాల ఉపయోగాలను ప్రశ్నించారు. సంప్రదాయ స్కూల్ నిర్మాణం మరియు ఒక నిర్దిష్టమైన సమయాల్లో నేర్చుకునే విద్య విద్యార్థులకు అంతగా సహాయపడదని వారి నమ్మకం. ఒకే వయసులోని విద్యార్థి సమూహాల్లో ప్రామాణికమైన టెస్ట్లలో ఉండే గ్రేడింగ్ పద్ధతులు , బలవంతమైన కాంటాక్ట్ మరియు చర్చలు, హోంవర్క్ లెర్నర్లకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించకుండా అది పూర్తి చేయాలని బలవంతం చేయడం, ఒక అథారిటీ రూపొందించిన సూచనలను తప్పకుండా విని ఆచరించేలా వారిని బలవంతం చేయడం.. ఇంకా సంప్రదాయ స్కూళ్లలో ఉండే అనేక ఫీచర్లు పిల్లల అభివ్రుద్ధికి అసలు తోడ్పడవు. ప్రతి పిల్ల/పిల్లాడు ప్రత్యేకమే. అలాగే అన్‌స్కూలింగ్ ద్వారా వారి అవసరాలకు అనుగుణంగా ఒక్కొక్కరికీ అన్నీ నేర్పించవచ్చని వారు నమ్ముతారు.
అన్‌స్కూలింగ్ లో తల్లిదండ్రులు తప్పకుండా:
- అందరి పిల్లల అభిరుచులను సమానంగా గౌరవించాలి.
- సాధారణ జీవితం కాకుండా మరింత స్వేచ్ఛగా తమ రోజువారి జీవితాన్ని తెరచిన పుస్తకంలా జీవించే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి.
- పిల్లలకు ఆసక్తికరమైనవాటిని వివిధ మార్గాల్లో వివిధ రకాలుగా చేయడానికి ప్రయత్నించాలి.
- ఇంటి లోపల అలాగే ఇంటి బయట కూడా వివిధ చక్కని అనుభవాలు కలిగేలా కుటుంబ జీవితాన్ని జీవించాలి.
- ఆశ్చర్యకరమైన మరియు ప్రోత్సాహకరమైన వనరులను వీలైనంతవరకు ఇంటి చుట్టూ అందుబాటులో ఉండేలా చూడాలి.
- పిల్లలతో మాట్లాడడం లేదా వారినీ చర్చల్లో భాగం చేయడం వంటివి తప్పకుండా చేయాలి. ఇది అన్‌స్కూలింగ్‌లో భాగంగా ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన చర్య.
- క్రీడా కార్యకలాపాలు, సరదాగా ఉండడం, వారి చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని ప్రశంసించడం. వంటి వాటిలో పిల్లల్ని పాల్గొనేలా చేయండి.
- వారి ఆలోచన మరియు ప్రవర్తన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
- వారి ఊహాశక్తి పరిధిని పెంచడం, వారి ఊహలను ప్రశ్నించడం, కొత్త సందేహాలు వచ్చేలా చేయడం, వారి ప్రతిస్పందన చర్యలను పరీక్షించడం వంటివి చేయాలి.
- పిల్లలు ఏం చేస్తున్నారనే విషయమై ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండండి.
- పిల్లలు చేసే పనులకు గల కారణాలను గమనించండి. నేర్చుకోవడానికి పుట్టినవారు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారని నమ్మండి.
- ఏ విధానాల్లో అయితే లెర్నింగ్ పిల్లలకు ఇష్టమో అవి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
- పిల్లల అభిరుచులను సపోర్ట్ చేయండి.
అన్‌స్కూలింగ్ యొక్క నియమాలు:
- లెర్నింగ్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మెదడు ఎప్పుడూ పని చేయడం ఆపదు. కాబట్టి సమయాన్ని లెర్నింగ్ పీరియడ్ మరియు నాన్ లెర్నింగ్ పీరియడ్‌గా విడదీయలేం. ఒక వ్యక్తి వినేది, చూసేది, ముట్టుకునేది, వాసన చూసేది, రుచి చూసేది.. ఇలా ప్రతీది లెర్నింగ్‌కి దారి తీస్తుంది.
- అయితే లెర్నింగ్ కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఒకరి ఇష్టానికి విరుద్ధంగా జరిగేది కాదు. బలవంతం అనేది వారిని బాధించడమే కాదు వారిలో నిరోధకతను కూడా పెంచుతుంది.
- నేర్చుకోవడం ఎప్పుడూ ఒక చక్కని అనుభూతిని కలిగిస్తుంది. సంతృప్తికరంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. బహుమతులు వారిలో లేని పోని కోరికలను రేకెత్తించడమే కాకుండా అభ్యాసాన్ని ఏవిధంగానూ మెరుగుపరచలేవు.
- ఒక వ్యక్తి గందరగోళానికి గురైతే లెర్నింగ్ ప్రక్రియ ఆగిపోతుంది. జనరల్ నాలెజ్డ్ ఆధారంగానే లెర్నింగ్ అంతా జరగాల్సి ఉంటుంది.
- ఒక వ్యక్తి లెర్నింగ్ అనేది కష్టమని భావిస్తే అది కష్టంగానే ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా బోధనా పద్ధతులు లెర్నింగ్ అంటే ఓ కష్టతరమైన ప్రక్రియగానే భావించేలా చేస్తున్నాయి. విద్యార్థులకు అలాగే నేర్పుతున్నాయి కూడా.
- లెర్నింగ్ ఎప్పుడూ అర్థవంతంగా ఉండాలి. అసలు ముఖ్యమైన పాయింట్ ఏదో ఒక వ్యక్తికి తెలియకపోయినా, వాస్తవ ప్రపంచంలో అది ఎలా ఉపయోగపడుతుందో లేక అది ఎలా సంబంధం కలిగి ఉంటుందో తెలియకపోతే లెర్నింగ్ అనేది వాస్తవికంగా ఉండదు. అది కేవలం తాత్కాలికం మరియు మిడిమిడిజ్నానంతో కూడుకున్నది అవుతుంది.
- లెర్నింగ్ తరచూ యాద్రుచ్చికం కూడా అవుతుంది. అంటే మనం కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఎంజాయ్ చేస్తూనే లెర్నింగ్ కూడా ప్రత్యామ్నాయ లాభంగా పొందచ్చు.
- లెర్నింగ్ అనేది ఒక సామాజిక కార్యకలాపం. ఇది విడిగా ఒక్కొక్కరుగా జరిగేది కాదు. నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని కలిగిన ఇతరుల నుంచి మన ఆసక్తికి తగినట్లుగా మనం నేర్చుకుంటాం. అది కూడా వివిధ మార్గాల్లో అని గుర్తుంచుకోవాలి.
- లెర్నింగ్ అంతటిలోనూ హావభావాలు మరియు తెలివితేటలు కూడా భాగమే.
Embibe ప్రోడక్ట్/ఫీచర్స్: మల్టిపుల్ కంటెంట్ టైప్స్
లెర్నింగ్ అనేది ఇకపై కేవలం మార్కులకు సంబంధించింది మాత్రమే కాదు. సిలబస్ దాటి నేర్చుకోవడం అనేది ఒక సరదా కూడా. విద్యార్థులు అంశాలకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలనేది Embibe యొక్క ప్రధాన ఉద్దేశం. వెబ్‌లో ఉన్న Embibe యొక్క వివరణాత్మక వీడియోతో పాటు అనేక ఆసక్తికరమైన వీడియోలు ఏ అంశం గురించైనా చక్కని అవగాహన కల్పిస్తాయి. మా ‘సెర్చ్’ ఆప్షన్ ద్వారా అందించే ‘లెర్న్’ మాడ్యూల్స్‌లో ఈ కింది రకాలకు సంబంధించిన ఒకటి లేదా ఎక్కువ వీడియోలు కలిగి ఉంటాయి:
- డీఐవై (డూ ఇట్ యువర్‌సెల్ఫ్) వీడియోలు
- Coobo వీడియోలు
- వర్చువల్ ల్యాబ్ వీడియోలు
- వాస్తవ జీవిత ఆధారిత ఉదాహరణల వీడియోలు
- స్పూఫ్స్ లేదా సరదా రకమైన వీడియోలు
- ప్రయోగాలు
- పరిష్కరించిన ఉదాహరణలు
Embibe యొక్క చర్చనీయమైన మరియు ఎంగేజింగ్ 2D మరియు 3D ప్రపంచం విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించడం మాత్రమే కాదు వారిని చదువుతో ప్రేమలో పడేలా కూడా చేస్తుంది. మా కథకులు విద్యార్థుల ఊహాశక్తిని గ్రహించి వాటికి అనుగుణంగా సరదాతో కూడిన చక్కని కథలను అల్లారు.