పాలో ఫ్రెయర్ అనే ఒక బ్రెజిలియన్ తత్వవేత్త మరియు విద్యావేత్త సంక్లిష్ట బోధనాశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించారు. సంక్లిష్టమైన బోధనాశాస్త్రం అనేది విద్యకు సంబంధించిన ఒక తత్వశాస్త్రం. ఇది విమర్శనాత్మక సృహ కలిగించడం ద్వారా హింస నుంచి విముక్తి లభించాలని సూచిస్తుంది. సామాజిక న్యాయం మరియు ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యలనేవి బోధన మరియు అభ్యాస చర్యలకు సంబంధించినవని ఇది నొక్కి చెబుతుంది.
సంక్లిష్ట బోధనాశాస్త్రం సిద్ధాంతం ప్రకారం జాత్యహంకారం, సెక్సిజమ్ మరియు ఇతరత్రా రకాల హింసలను ఎదుర్కోవడానికి బోధనామార్గాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. సంప్రదాయాలు, సంస్కృతులు, సాంఘిక విషయాలు మరియు స్థిర మనస్తత్వంలో దాగి ఉన్న విషయాల నుంచి తలెత్తే సమస్యలకు గల కారణాలు, వాటి ప్రభావాలను గుర్తించేందుకు ఇది సహకరిస్తుంది. ఇది మూడు రకాల అంశాల ద్వారా ఈ అణచివేతలను అధిగమించాలని సూచిస్తుంది. అవి ఒక సిద్ధాంతం, పాఠం లేదా నైపుణ్యాలు రూపొందించబడే లేదా గ్రహించబడే విధానమే ‘ప్రాక్సిస్’. ఆలోచనలను అభ్యాసం చేయడం లేదా తెలుసుకోవడం, వాటి మీద పని చేయడం, వాటిని అనువర్తించడం, నిమగ్నం చేయడం వంటివి కూడా ‘ప్రాక్సిస్’ కిందకే వస్తాయి.
గుప్త పాఠ్యప్రణాళిక అనేది కొన్ని పాఠ్యాంశాల సమాహారం. ఇవి నేర్చుకునేవే కానీ బహిరంగంగా ఉద్దేశించినవి కావు. వీటిని స్కూల్లోనే బోధిస్తారు. విధానాలు, విలువలు, నమ్మకాలు. ఇలాంటివి తరగతి గదితో పాటు సాంఘిక వాతావరణంలో కూడా నేర్పిస్తారు.
1960లలో యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన స్త్రీవాదుల ద్వారా ప్రాచుర్యం పొందిన క్రియాశీలత యొక్క ఒక రూపం స్పృహతో పెంచడం. తరచుగా ఒక కారణం లేదా పరిస్థితి పై ఒక విశాల సమూహం యొక్క దృష్టిని ఆకర్షించేందుకు కొందరు వ్యక్తుల సమూహం యొక్క రూపం ఇది.
సంక్లిష్ట బోధనాశాస్త్రం ప్రతి లెర్నర్‌ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తుంది. అలాగే నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం లేదా తిరిగి నేర్చుకోవడం, నేర్చుకున్నవి ప్రతిబింబించడం మరియు వాటిని అంచనా వేయడం అనేవి చాలా ముఖ్యమైన పద్ధతులుగా భావిస్తుంది. వీటి ద్వారా విద్యార్థి తదుపరి అభ్యాసాలలో వారి ఆసక్తులు మరియు ప్రపంచ అనుభవాలకు అనుగుణంగా మరింత నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. అయితే విద్యార్థులు వారి ప్రశ్నలకు వారే సమాధానాలు అన్వేషించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.
ఈ బోధనా నమూన శాస్త్రం విద్యా వ్యవస్థకు సంబంధించిన బ్యాంకింగ్ నమూనాని వ్యతిరేకిస్తుంది. బ్యాంకింగ్ నమూనా ప్రకారం విద్యార్థులను డిపాజిట్ దారులుగానూ, ఉపాధ్యాయులను డిపాజిటర్లుగానూ పరిగణిస్తారు. బ్యాంకింగ్ నమూనా అనేది ఒక క్రమపద్ధతిలో నిర్వహించబడుతుంది మరియు అధికారికంగా కూడా స్పష్టంగా, చక్కగా ఉంటుంది. కానీ అది ప్రతి లెర్నర్ ని ప్రత్యేకంగా భావించదు. ఎవరి అవసరాలు, లెర్నింగ్ లక్ష్యాలు ఇవేవీ పరిగణనలోకి తీసుకోదు. ఫలితంగా బ్యాంకింగ్ నమూనాలో స్కూల్స్ మరియు విద్యాసంస్థలు అనేవి వ్యక్తిగతపరమైన శిక్షణ లేని లెర్నర్స్‌ని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మారుతున్నాయి.
సంక్లిష్ట బోధనాశాస్త్రం లెర్నర్‌కి టెక్ట్స్ నుంచి ఆలోచనలకు మరియు సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది.
ప్రోడక్ట్/ఫీచర్స్; సెర్చ్, క్రియేట్ యువర్ ఓన్ టెస్ట్, 24×7 ఎక్స్‌పర్ట్ అసిస్టెన్స్
సంక్లిష్ట బోధనాశాస్త్రంలో ప్రాక్సిస్, గుప్త పాఠ్యప్రణాళిక మరియు స్పృహతో పెంచడం అనే వాటి ఆధారంగా Embibe బోధన ఉంటుంది. విద్యార్థులు పాఠాల్లో లీనమయ్యే విధంగా వాటిని 2D, 3D మెటీరియల్స్ మరియు చర్చించదగిన ఎక్సర్‌సైజులుగా వాటిని అందిస్తుంది. ‘లెర్న్’, ‘ప్రాక్టీస్’, ‘టెస్ట్’ మరియు ‘టెస్ట్ అనాలసిస్’ ద్వారా విద్యార్థులకు బోధిస్తుంది.
Embibeలో ఉన్న ‘సెర్చ్’ ఫీచర్ ద్వారా విద్యార్థులు వారు కోరుకున్న వీడియో, అభ్యాస ప్రశ్నలు లేదా అధ్యాయాలు లేదా అంశాలకు నేరుగా చేరుకోవచ్చు.
Embibeలో చాప్టర్ టెస్ట్, పార్ట్ టెస్ట్, ఫుల్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ టెస్ట్ మరియు కస్టమ్ టెస్ట్ వంటి వివిధ టెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఒక పరీక్షా చక్రంలో గల వివిధ దశలను దృష్టిలో పెట్టుకుని ఈ టెస్ట్స్‌ని క్రియేట్ చేశారు. ‘క్రియేట్ యువర్ ఓన్ టెస్ట్’ అనే ప్రత్యేక ఫీచర్ ద్వారా Embibe ఎవరికి వారు సొంతంగా టెస్ట్స్‌ని రూపొందించుకునే అవకాశం కల్పిస్తుంది. సబ్జెక్ట్స్, అధ్యాయాలు, కఠినతర స్థాయి, పరీక్షా సమయం మరియు మార్కుల ప్రణాళికని ఉపయోగించడం ద్వారా ఛాయిస్ ఆధారిత లేదా లక్ష్య ఆధారిత టెస్ట్‌ని క్రియేట్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. కస్టమ్ టెస్ట్ ప్రతి లెర్నర్‌ని చాలా ప్రత్యేకంగా భావిస్తుంది. అలాగే వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడుతుంది.
అలాగే Embibeలో 24X7 ‘లైవ్ ఫ్యాకల్టీ సపోర్ట్’ అందుబాటులో ఉంటుంది. మా చాట్ సపోర్ట్ ఉపయోగించడం ద్వారా విద్యార్థులు వారికి ఉన్న విద్యాపరమైన సందేహాలను పోస్ట్ చేయడం, వ్యూహాలు, గుప్త పాఠ్యప్రణాళిక గురించి చర్చించడం, నిమిషాల్లో Embibeలో ఉన్న నిపుణుల నుంచి స్పష్టత పొందడం అనేది జరుగుతుంది. Embibeలో ఏ ఒక్క సందేహం తీరకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో చాలా శ్రమతో పని చేస్తున్నాం. అలాగే ప్రతి విద్యార్థి అతను/ఆమె సబ్జెక్ట్స్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లాలన్నదే మా ధ్యేయం.