రాడికల్ కన్‌స్ట్రక్టవిజం అనేది విజ్ఞానం యొక్క సిద్ధాంతం. ఇది వాస్తవికత, సత్యం మరియు మానవ అవగాహనకు సంబంధించిన ప్రశ్నలకు వాస్తవంతో కూడిన ఆచరణను అందిస్తుంది. ఈ పదాన్ని 1974లో ఎర్నెస్ట్ వాన్ గ్లేసర్ ఫెల్డ్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం వ్యక్తులు లేదా అభ్యాసకులు విజ్ఞానం సముపార్జించుకోవడంతో పాటు ప్రపంచాన్ని అర్థంచేసుకోవడంలోనూ కీలకంగా వ్యవహరించనుంది. ఈ సిద్ధాంతం ప్రకారం అభ్యాసకులు నిష్క్రియాత్మకంగా ఎలాంటి విజ్ఞానం పొందలేరు. దానికి బదులుగా లెర్నర్స్ కొత్త సమాచారాన్ని సమీకరించడం, ఉన్న విజ్ఞానం అనుసంధానించడం ద్వారా తమకి తాముగా విజ్ఞానం పొందవచ్చు.
రాడికల్ కన్‌స్ట్రక్టవిజం అభ్యాసకులకు చుట్టూ ఉన్న పరిస్థితిని వారి మనసులో నాటుకుపోయేలా చేస్తుంది. అలాగే పరస్పర చర్చలు, వివరణల ద్వారా విజ్ఞాన సముపార్జనకు దారి తీస్తుంది. దీని ద్వారా ప్రతి విద్యార్థి వారి విజ్ఞానాన్ని వారే సొంతంగా సముపార్జించుకోవచ్చు. అలాగని ఆబ్జెక్టివ్ రియాలిటీ పూర్తిగా లేదని దీని అర్థం కాదు. ఈ సిద్ధాంతం ఆబ్జెక్టివ్ రియాలిటీ గురించి తెలుసుకోవడానికి సరైన మార్గం లేదని మాత్రమే చెబుతుంది.
కన్‌స్ట్రక్టవిజం అనేది ఒక నేర్చుకునే సిద్ధాంతం. దీని ప్రకారం ముందుగానే అమల్లో ఉన్న వాస్తవాల యథార్థాన్ని బోధించడం వల్ల విద్యార్థులకు విజ్ఞానం పొందడం లేదా అర్థం చేసుకోవడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనికి బదులుగా ప్రతి అభ్యాసకుడు అతను/ఆమె వారంతట వారుగా విజ్ఞానం పొందడానికి సుముఖత చూపడమే కాకుండా వారు పొందన విజ్ఞానం నుంచి కొత్త విజ్ఞానం కూడా పెంపొందించుకోవాలి. ప్రతి అభ్యాసకుడు తమకంటూ సొంతంగా విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. దీనిని తమ జీవితమంతా వృద్ధి చేసుకుంటూ వెళతారు.
రాడికల్ కన్‌స్ట్రక్టవిజం యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థులను విజ్ఞానం రూపొందించుకునే దిశగా ప్రోత్సహించడం మరియు సమస్యలను నిశితంగా అర్థం చేసుకునే అవగాహనను పెంపొందించడం. ఇది పాఠాలు వినడం మరియు గుర్తు పెట్టుకోవడం ద్వారా కాకుండా విద్యార్థులు తమంతట తాముగా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం మరియు నేర్చుకునే ప్రక్రియలో వివిధ కృత్యాల్లో పాల్గొని అనుభవాలను సొంతం చేసుకోవడం ద్వారా నేర్చుకుంటారు. కన్‌స్ట్రక్టవిజం బోధనలో ఆలోచనలు చర్చించడం, కృత్యాలకు సహాయసహకారాలు అందించడం, మార్గదర్శక ఆవిష్కరణల ద్వారా విద్యార్థులకు నేర్చుకునే ప్రక్రియలో తోడ్పడతాయి.
ఒక వ్యక్తికి ఒక కొత్త అనుభవం లేదా ఆలోచన ఎదురైనప్పుడు వారు దానిని గత అనుభవాలు లేదా ఆలోచనలతో సమన్వయపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్త సమాచారం విముఖత పొందుతుందనే నమ్మకంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా మానవులుగా మనకు మనం సొంతంగా ప్రశ్నలు అడగడం, అన్వేషించడం మరియు మనం తెలుసుకున్నదానిని అంచనా వేయడం ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు. అప్పుడు అది మనం అన్ని రకాలుగా ఆలోచించేందుకు, అన్వేషించేందుకు తోడ్పడుతుంది.
నిర్మాణాత్మక బోధన చేసే ఉపాధ్యాయులు టెక్ట్స్‌బుక్స్ ద్వారా కాకుండా కృత్యాల ద్వారా నేర్చుకోవాలని విద్యార్థులకు నొక్కి చెప్పాలి. అప్పుడే ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ముందే నెలకొని ఉన్న అపార్థాలను అర్థం చేసుకుని వాటిని తొలగించేందుకు వాస్తవ ప్రపంచ సంబధమైన సమస్యలు, వాటి పరిష్కారాలు మరియు ప్రయోగాల ద్వారా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. నిర్మాణాత్మక తరగతి గదిలో ఉండే ఉపాధ్యాయులు విద్యార్థులను తమని తాము ప్రశ్నించుకునేలా ప్రోత్సహించాలి. వారి వ్యూహాలు, అర్థం చేసుకోవడానికి ఉపయోగించే వివిధ రీతులు ఎలా వారికి తోడ్పడుతున్నాయో పరిశీలించాలి. అప్పుడే విద్యార్థులు నేర్చుకోవడంలో నైపుణ్యం సంపాదిస్తారు. తద్వారా ఒకే విధమైన వాస్తవాలను మళ్లీ మళ్లీ రిపీట్ చేయకుండా ఉత్సాహంగా సొంతంగా విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు.
ఈ పద్ధతి ద్వారా విద్యార్థులకు బోధించడం అనేది చాలా ప్రభావంతమైంది. ఏ విద్యార్థులైతే తాము తరగతి గదిలో నేర్చుకునేవాటిని రోజువారీ జీవితంలో అనువర్తించడం ద్వారా మరింత చక్కగా విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారో వారికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. నిర్మాణాత్మక పాఠ్యప్రణాళిక విద్యార్థులకు ముందు ఉన్న విజ్ఞాన స్థాయిని కూడా పరిగణనలోకి తీసుకుని, వారికి నచ్చే అంశాలకు సంబంధించి మరింత ఎక్కువ సమయం ఉపాధ్యాయులు వెచ్చించేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ఆయా అంశాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం వారికి అందించే వీలు ఉంటుంది. వీటి ద్వారా విద్యార్థులు సామాజిక నైపుణ్యాలు, ఒకరిని మరొకరు నేర్చుకునే ప్రక్రియలో సపోర్ట్ చేసుకోవడం, ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం వంటివి నేర్చుకుంటారు.
సాధారణంగా కన్‌స్ట్రక్టవిజం అనేది విద్యార్థులు చక్రాన్ని తిరిగి ఆవిష్కరించే ఒక నేర్చుకునే సిద్ధాంతం అని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇది ప్రపంచం మరియు అది ఎలా పని చేస్తుందనే విషయం గురించి విద్యార్థుల్లో సహజసిద్ధమైన ఉత్సుకతని రేకెత్తిస్తుంది. విద్యార్థులు చక్రాన్ని తిరిగి ఆవిష్కరించే అవసరం లేదు కానీ అది ఎలా పని చేస్తుంది మరియు దాని విధులేంటి అన్నది తప్పకుండా అర్థం చేసుకోవాలి. వారికి ముందుగానే ఉన్న పరిజ్ఞానంతో వాస్తవ ప్రపంచ అనుభవం, నేర్చుకునే సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను పరీక్షించడం మరియు వారి ఆవిష్కరణల అనుగుణంగా వాటికి ముగింపు ఇవ్వడం వంటివి చేస్తారు.
Embibe ప్రోడక్ట్/ఫీచర్స్; డూ ఇట్ యువర్‌సెల్ఫ్/ ప్రాక్టీస్
విద్యార్థులకు వారి సామర్థ్యానికి తగిన విధంగా విద్యను అందించేందుకు Embibe కృత్రిమ మేథస్సుని వినియోగిస్తుంది. వీడియోలు చూడడం, ఉత్తమ పుస్తకాల నుంచి ప్రశ్నలను అభ్యాసం చేయడం, మాక్ టెస్ట్స్‌ని ట్రాక్ చేయడం ద్వారా వారు నేర్చుకున్నదాని ఫలితాన్ని అంచనా వేయడం, లోతైన విశ్లేషణతో వారి మార్కులను మరింత మెరుగుపరుచుకోవడంలో వారికి ఇది సహకరిస్తుంది.
విద్యార్థులు సమస్యలను అంశాల వారీగా చక్కగా అర్థం చేసుకోవడమే రాడికల్ కన్‌స్ట్రక్టవిజం యొక్క ప్రధాన ధ్యేయం అని మనకి ఇప్పటికే తెలుసు. Embibeలో ‘డూ ఇట్ యువర్‌సెల్ఫ్’ వీడియోలు, ‘లెర్న్’ మాడ్యూల్ విద్యార్థులను రాడికల్ కన్‌స్ట్రక్టవిజంలో ప్రోత్సహిస్తాయి. ఈ వీడియోలు బాగా నేర్చుకునే విద్యార్థులకు ఉపయోగపడడమే కాదు వారు తరగతి గదిలో నేర్చుకున్న వాటిని రోజువారీ జీవితంలో అనువర్తించడానికి కూడా తోడ్పడుతుంది.
Embibe ‘ప్రాక్టీస్’ మాడ్యూల్‌లో కూడా రాడికల్ కన్‌స్ట్రక్టవిజంని ఉపయోగిస్తుంది. ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రశ్నలను సూక్ష్మ స్థాయిలో సమీకరించి వాటిని ‘ప్రాక్టీస్’ భాగంలో ఉంచింది. అలాగే ప్రతి ప్రశ్న 63+ అంశాలుగా విభజితమై సూక్ష్మస్థాయిలో వ్యక్తిగతీకరించబడి సమస్యను పరిష్కరించడానికి ప్రతి దశలోనూ ఉపయోగపడతాయి. ఈ మాడ్యూల్ సరిపడినన్ని ప్రశ్నలు అభ్యాసం చేయడానికి అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు వారి అవసరాలకు అనుగుణంగా అంశాలు మరియు పాఠ్యప్రణాళికలోని టాపిక్స్‌వారీగా వాటిని అభ్యాసం చేయచ్చు. Embibeలో అందించే వివరణాత్మక పరిష్కారాలు నిపుణులైన అధ్యాపకులు అందించేవి. సూచించబడిన టెక్ట్స్‌బుక్స్ మరియు ఒక గ్రేడ్ లేదా పరీక్షకు చెందిన ప్రాచుర్యం పొందిన రిఫరెన్స్ బుక్స్ నుంచి సేకరించబడినవి.