ప్రతి అంశంలోనూ విద్యార్థుల నిపుణతను అన్వేషించడం ద్వారా కష్టమైన సమస్యలను పరిష్కరించడం
Embibe అందించే సమాచారం విద్యార్థి ఒక అంశంలో నిపుణత సాధించడానికి ఎలా తోడ్పడుతుందో అర్థం చేసుకుందాం.
Embibe అందించే సమాచారం విద్యార్థి ఒక అంశంలో నిపుణత సాధించడానికి ఎలా తోడ్పడుతుందో అర్థం చేసుకుందాం.
విద్యార్థులు అంశాల వారీగా నైపుణ్యాన్ని సాధించడంలో సహాయపడడానికి Embibe సమాచారాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం. ప్రతి అంశం మీద విద్యార్థి నైపుణ్యాన్ని అన్వేషిస్తూ కష్టతరమైన సమస్యని పరిష్కరించడం.
ఎవరికైతే కలపడం తెలీదో వారు గుణకారం కూడా చేయలేరు. గణితం మరియు సైన్స్‌లోని అంశాలలో ఒకదానితో మరొకటి అలా ముడిపడి ఉంటాయి. ఒక లెర్నర్ ఒక అంశాన్ని బాగా అర్థం చేసుకుంటే దాని ఫలితాన్ని సులభంగా మరియు వేగంగా గుర్తించగలరు. విద్యార్థి యొక్క విజ్ఞాన స్థాయిని బట్టి వ్యక్తిగతపరమైన లెర్నింగ్ ప్రక్రియను అందించడం Embibe యొక్క ప్రాథమిక లక్ష్యం. అంశాల స్థాయిలో ఈ వేదిక మీద విద్యార్థి యొక్క ఇంటరాక్షన్స్‌ని మానిటర్ చేయడం ద్వారా వారి ప్రతిభాస్థాయిని తెలుసుకుంటుంది. వీడియోలు చూడడం, ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం, టెస్ట్లు తీసుకోవడం మరియు టెస్ట్ ఫీడ్‌బ్యాక్‌ని సమీక్షించడం వంటివి కూడా ఇంటరాక్షన్స్‌లోకి వస్తాయి. ఈ ఇంటరాక్షన్స్‌ను అధికం చేస్తే అవి ఆయా అంశాల్లో విద్యార్థి యొక్క నైపుణ్యంగా పిలువబడే కాన్సెప్ట్ మాస్టరీ గురించి మనకు తెలుస్తుంది.
మోడలింగ్ కాన్సెప్ట్ మాస్టరీ అనేది అంతర్గతంగా సంక్లిష్టమైంది. ఎందుకంటే దీనికి మానవ అవగాహన మరియు ఒక మానవుడు ఎలా విజ్ఞానాన్ని సంపాదిస్తాడు అనేది తెలుసుకోవడం అవసరం. ఒక మనిషి విజ్ఞానాన్ని ఎలా సముపార్జిస్తాడు అనే విషయమై వివిధ ఇంటరాక్షన్స్‌ని రికార్డు చేసి ఉంచుతారు. అలాగే వివిధ అంశాల మీద విద్యార్థి యొక్క ఇంటరాక్షన్స్ హిస్టరీ అనేది సరిపోదు. ఈ కొరత క్రమంగా విద్యార్థి యొక్క బలాలు మరియు బలహీనతలను గుర్తించడంలో ఖచ్చితత్వం తగ్గడానికి దారి తీస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా 1s మరియు 0s అనేవి నువ్వు ఎంత విజయవంతమైన వ్యక్తివో నిర్ధారించేందుకు సరిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి విద్యార్థి తెలివిని వివిధ కోణాల్లో విశ్లేషించాల్సి ఉంటుంది.
లెర్న్: ఒక అంశం మీద పట్టు సాధించడంలో వేయాల్సిన మొదటి అడుగు ఆ అంశాన్ని బాగా అర్థం చేసుకోవడం. ఇచ్చిన ఆలోచనలకు సంబంధించి మానసికంగా లీనమయ్యేలా చేస్తూ వివిధ ఇమేజ్‌ల ద్వారా దృశ్యపరంగా నేర్చుకున్నదాని కంటే మరే ఇతర మార్గం ప్రభావితమైంది కాదు. Embibe యొక్క లెర్న్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమమైన 3D కంటెంట్ ఉంటుంది. వీటి ద్వారా క్లిష్టమైన అంశాలు కూడా దృశ్యీకరణం సహాయంతో చాలా సులభంగా నేర్చుకోవచ్చు. పరిశ్రమలోనే అత్యంత ఎక్కువగా 74,000+ అంశాల యొక్క నాలెడ్జ్ గ్రాఫ్ మరియు 2,03,000+ సామర్థ్యాల కలయికతో ఏర్పడే పునాదిపై నేర్చుకున్న అనుభవం కలుగుతుంది. Embibe అందించే బోధనశాస్త్రం దోషరహితమైన అభ్యాస కంటెంట్ వివిధ తరగతులు, పరీక్షలు మరియు లక్ష్యాలలో లోతైన వ్యక్తిగతీకరణను అందిస్తాయి.
ప్రాక్టీస్: ఎందులో అయినా నైపుణ్యం సాధించాలంటే అందుకు అభ్యాసం చాలా కీలకం. ‘కాన్సెప్ట్ మాస్టరీ’కి కూడా ఇదే వర్తిస్తుంది. Embibe ప్రాక్టీస్ అనేది బోధనా శాస్త్రంలో టాప్ ర్యాంక్‌లో ఉన్న 1000+ పుస్తకాలకు సంబంధించిన అత్యాధునికమైన 10 లక్షల + ఇంటరాక్టివ్ ప్రశ్నలను వివిధ అధ్యాయాలు మరియు అంశాలుగా కలిగి ఉంది. అలాగే లోతైన విజ్ఞాన అన్వేషణ ద్వారా ప్రతి విద్యార్థికీ ప్రత్యేకమైన మరియు వ్యక్తిగతపరమైన ప్రాక్టీస్ మార్గాన్ని రూపొందిస్తూ వారి అనుసరణీయమైన ప్రాక్టీస్ ఫ్రేమ్‌వర్క్‌ని మరింత బలపరుస్తుంది. సాల్వర్స్ మరియు టెంప్లేట్లను ఉపయోగిస్తూ రన్ టైమ్‌లో క్రియాశీలమైన మరియు వ్యక్తిగతపరమైన ప్రశ్నలను ఉత్పత్తి చేస్తుంది. లెర్నింగ్ కోసం సిఫార్సు ఇంజన్లను ఉపయోగించడం ద్వారా ఏదైనా అంశం లేదా ప్రశ్న విషయంలో విద్యార్థి ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు వీడియోలు లేదా సూచనల ద్వారా వారికి ఆటోమేటిక్‌గా సహాయం అందిస్తుంది. ప్రతి ప్రశ్నను అటెంప్ట్ చేసిన తర్వాత అందులోని నాణ్యతని బట్టి ఫీడ్‌బ్యాక్‌ని ‘టూ ఫాస్ట్ కరెక్ట్’, ‘పర్ఫెక్ట్ అటెంప్ట్’, ‘ఓవర్‌టైమ్ కరెక్ట్’, ‘వేస్టెడ్ అటెంప్ట్’, ‘ఇన్‌కరెక్ట్ అటెంప్ట్’ మరియు ‘ఓవర్‌టైమ్ ఇన్‌కరెక్ట్ అటెంప్ట్’ విభాగాలుగా విభజించబడుతుంది. తద్వారా అభ్యాసకులకు వారి స్థితిని తెలియజేసి అప్రమత్తం చేస్తుంది.
టెస్ట్: విద్యార్థి ప్రిపరేషన్ సైకిల్‌లో ఉన్న ప్రతి దశకు అనుగుణంగా Embibe టెస్ట్స్ అందిస్తోంది. వీటితో పాటూ విద్యార్థికి వారు తీసుకున్న టెస్ట్‌కి సంబంధించిన వివరణాత్మక ఫీడ్‌బ్యాక్ కూడా ఇక్కడ లభిస్తుంది. దీని ద్వారా వారు తమ విద్యాపరమైన మరియు ప్రవర్తనాపరమైన అంతరాలను గుర్తించే వీలు ఉంటుంది ఉదాహరణకు Embibe కృత్రిమ మేథస్సు అంశాలను గుర్తించడం మాత్రమే కాదు.. వాటిని ‘చాప్టర్స్ యు గాట్ రైట్’, ‘చాప్టర్స్ యు గాట్ రాంగ్’ మరియు ‘చాప్టర్స్ యు డిడ్‌నాట్ అటెంప్ట్’ అనే విభాగాలుగా విభజించింది. విద్యార్థులు కూడా తమ ‘సిన్సియారిటీ స్కోర్’ని చెక్ చేసుకుని అంశాలవారీగా తమ ప్రవర్తన గురించి తెలుసుకోవచ్చు. అలాగే సమయపాలనకు సంబంధించిన సమస్యల గురించి కూడా ముందే తెలుసుకుని వాటిని సరిచేసుకోవడం ద్వారా మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
Embibe లెర్నింగ్ అవుట్‌కమ్‌లో కాన్సెప్ట్ మాస్టరీ ప్రధాన భాగం. ఈ వ్యవస్థ విద్యార్థి యొక్క కాన్సెప్ట్ మాస్టరీని అంచనా వేయడానికి దాదాపు 74,000 అంశాలకు అనుసంధానమైన Embibe నాలెడ్జ్ గ్రాఫ్‌ని ఉపయోగిస్తుంది. ఏ అంశంలో, ఎక్కడ విద్యార్థి వెనుకబడి ఉన్నరు? లక్ష్య పరీక్షలో మెరుగైన మార్కులు సాధించేందుకు ఇంకా ఎలాంటి అంశాల్లో తమని తాము మెరుగుపరుచుకోవాలి. వంటి విషయాలు Embibe యాప్‌లో తెలుసుకునేందుకు ఈ నాలెడ్జ్ గ్రాఫ్ సహాయపడుతుంది. అలాగే బ్లూమ్ టాక్సానమీ అనేది జ్ఞానాన్ని అవగాహన మరియు అనువర్తనంగా విభజించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రశ్నలన్నీ వాటి కఠినతర స్థాయిలకు అనుసంధానం అయి ఉంటాయి. ఇవి విద్యార్థి యొక్క విజ్ఞాన స్థాయి గురించి తెలుసుకోవడంలో తోడ్పడతాయి. నాలెడ్జ్ గ్రాఫ్, బ్లూమ్స్ టాక్సానమీ, కఠినతర స్థాయి. వంటి వాటిని ఉపయోగించుకోవడం ద్వారా కాన్సెప్ట్ మాస్టరీ నమూనాని మనం తెలుసుకోవచ్చు. వీటన్నింటితోపాటూ గత ఎనిమిదేళ్లుగా సేకరించిన బిలియన్ల కొద్దీ ఇంటరాక్షన్లను కూడా కొలమానాలుగా తీసుకుంటుంది.